గత కొన్నేళ్లుగా ఓ మహిళను మానసికంగా వేధిస్తున్న వ్యక్తిపై న్యాయస్థానం జీవితఖైదు శిక్షను వేసింది. అవకాశాలను ఇప్పిస్తానంటూ వర్ధమాన నటిపై పలుమార్లు అత్యాచారం జరపడమే కాకుండా ఆమె అసభ్యకర ఫోటోలను తీసి ఆమె భర్తకు పంపాడు. దీంతో కోర్టు అతనిపై ఆగ్రహం వ్యక్తం చేసి భారీ జరిమానా కూడా విధించింది. 

తీవ్ర కలకలం సృష్టించిన ఈ ఘటన ముంబై నగరంలో చోటు చేసుకుంది. రవీంద్రనాథ్ ఘోష్ అనే వ్యక్తి 2011లో ఆస్పత్రిలో పనిచేస్తోన్న వివాహితను పరిచయం చేసుకొని ఆమెకు నటన మీద ఉన్న మక్కువ గురించి తెలుసుకున్నాడు. అయితే తాను ఒక కెమెరామన్ - క్యాస్టింగ్ డైరెక్టర్‌ అని చెబుతూ యువతిని నమ్మించాడు. 

అనంతరం 2012లో ఆడిషన్స్ ఉన్నాయని చెప్పి  ఫిబ్రవరి 2012లో మధ్ ఐలండ్‌ కి తీసుకెళ్లాడు. తన కోరిక తీరిస్తేనే అవకాశాలను ఇప్పిస్తాను అని ఆమెపై అత్యచారం చేశాడు. ఇక ఆ తరువాత ఆమె నగ్న పోటోలను తీసి ఆమెను మరికొన్ని సార్లు బెదిరించి అత్యాచారం జరిపాడు. ఒకరోజు లక్ష రూపాయలు కూడా డిమాండ్ చేశాడు. ఇవ్వకుంటే నీ భర్తకు ఫొటోస్ పంపుతాను అని బెదిరించాడు. 

అయితే బాధితురాలు తరువాత ఇస్తాను అని చెప్పినప్పటికీ వినకుండా ఆమె భర్తకు ఫొటోల గురించి తెలిసేలా చేశాడు. దీంతో ఆమెను భర్త వదిలేశాడు. దీంతో ఫైనల్ గా ఆమె పోలీసులను ఆశ్రయించింది. ఈ కేసుపై ముంబై సెషన్ కోర్టు అత్యాచారం చేసిన వ్యక్తికి జీవిత ఖైదు విధించి ఒక లక్షా 31 వేలు జరిమానా ఇవ్వాలని చెప్పింది. అంతే కాకుండా అందులో బాధితురాలికి లక్ష రూపాయలు చెల్లించాలని న్యాయస్థానం తీర్పును ఇచ్చింది.