కమెడియన్ పై రెచ్చిపోయిన మహిళలు

Ladies counter to comedian vivek tweet
Highlights

కమెడియన్ పై రెచ్చిపోయిన మహిళలు

కొన్ని సార్లు సెలెబ్రిటీలు సరదాకి చేసిన కామెంట్స్ కూడా కాంట్రవర్సీగా మారి వారికి చిక్కులు తెచ్చిపెడుతుంటాయి. తమిళ కమెడియన్ వివేక్ పరిస్థితి ప్రస్తుతం ఇలాగే ఉంది. అతడు చేసిన ఓ ట్వీట్ పెద్ద చిక్కులు తెచ్చిపెడుతోంది. పలువురు నెటిజన్లు, మహిళలు వివేక్ తీరుని తప్పుబడుతూ దుమ్మెత్తిపోస్తున్నారు. ఇంతకీ ఈ వివాదం ఏంటంటే.. వివేక్ వేదసావి సెలవుల్లో గడుపుతున్న విద్యార్థులని పిల్లలని ఉద్దేశించి ఓ ట్వీట్ చేశాడు. ఈ వేసవి సెలవుల్లో బాగా ఎంజాయ్ చేయండి. వేసవి కాబట్టి బాగా మంచినీరు తీసుకోండి. అదే సమయంలో అమ్మాయిలు మీ తల్లులకు వంటగదిలో సాయం చేయండి. అలాగే అబ్బాయిలు మీ తండ్రి తో కలసి వెళ్ళండి. మీ కుటుంబం కోసం ఆయన ఎంతలా కష్టపడుతున్నాడో అర్థం అవుతుంది అని వివేక్ ట్వీట్ చేసాడు.

ఈ ట్వీట్ పై నెటిజన్లు, మహిళలు మండి పడుతున్నారు. మీ మైండ్ సెట్ మారాదా అంటూ వివేక్ కు చురకలు అంటిస్తునారు. అమ్మాయిలు వంట గదికి మాత్రమే పరిమితం కావాలని సలహాలు ఇస్తారా అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. తండ్రి పనిచేసే చోటుకి అబ్బాయిలు మాత్రమే వెళ్లాలా అమ్మాయిలు వంటగదిలో ఉండాలా.. ఇవేం సలహాలు అంటూ ప్రశ్నిస్తున్నారు.

loader