Asianet News TeluguAsianet News Telugu

సందీప్ వంగాకు ఇది అవమానం అంటూ ప్రచారం

ఎన్నో వివాదాలు, హాట్ సీన్స్ వంటివి యానిమల్ లో ఉన్నాయి. అదే  ‘లాపతా లేడీస్‌’కి జీరో హైప్..

Laapataa Ladies surpassing Animal Netflix views jsp
Author
First Published May 23, 2024, 11:26 AM IST

తండ్రీ కొడుకుల అనుబంధం నేపథ్యంలో రూపొందిన ‘యానిమల్‌’ (Animal) ఎంత పెద్ద హిట్టైందో తెలిసిందే. దీనిని సందీప్‌ రెడ్డి వంగా తెరకెక్కించారు. త్వరలోనే దీనికి సీక్వెల్‌గా ‘యానిమల్‌ పార్క్‌’ రానుంది.  అయితే ఈ సినిమాపై గతంలో ఆమిర్‌ ఖాన్‌ మాజీ భార్య కిరణ్‌ రావ్‌ (Kiran Rao) ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దానికి సందీప్ వంగా కూడా కౌంటర్ ఇచ్చారు. అక్కడితో ఆ వివాదం ముగిసినా జనం మాత్రం మర్చిపోలేదు. ప్రతీది వీళ్లద్దరి యాంగిల్ లో పోల్చి చూస్తున్నారు. 

ఇక తాజాగా కిరణ్‌రావ్‌ దర్శకత్వం వహించిన ‘లాపతా లేడీస్‌’ చిత్రం విడుదలైంది. ఆమిర్‌ ఖాన్‌ ప్రొడక్షన్స్‌, జియో స్టూడియోస్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. కామెడీ డ్రామాగా రూపొందిన ఈ సినిమా మంచి ఆదరణ పొందినందుకు ఆనందంగా ఉందని కిరణ్‌ రావ్‌ పేర్కొన్నారు.ఈ సినిమా నెట్ ప్లిక్స్ లో రిలీజైంది. అక్కడే యానిమల్ సైతం రిలీజ్ అవటంతో ఈ రెండింటి వ్యూస్ ని పోల్చి చూస్తున్నారు. దానికి తోడు ఇప్పుడు యానిమల్ వ్యూస్ ని ‘లాపతా లేడీస్‌’వ్యూస్ దాటేసాయి.

దాంతో ఎన్నో వివాదాలు, హాట్ సీన్స్ వంటివి యానిమల్ లో ఉన్నాయి. అదే  ‘లాపతా లేడీస్‌’కి జీరో హైప్..ఏ విధమైన వివాదం లేదు. అయినా సందీప్ వంగా యానిమల్ ని బీట్ అవుట్ చేసిందని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. యానిమల్ చిత్రానికి 13.6 మిలియన్ వ్యూస్ రాగా, ‘లాపతా లేడీస్‌’ 13.8 మిలియన్ వ్యూస్ వచ్చాయి. హృతిక్ రోషన్ ఫైటర్ చిత్రం 14 మిలియన్ వ్యూస్ లో టాప్ లో ఉంది. ఇప్పుడు ‘లాపతా లేడీస్‌’ సెకండ్ ప్లేస్ లోకి వచ్చింది. అలాగే యానిమల్ చిత్రంలో స్టార్ హీరో ఉన్నారు. కానీ ‘లాపతా లేడీస్‌’ లో స్టార్స్ ఎవరూ లేరు. ఇది కూడా చర్చగా మారింది. మరికొందరు సోషల్ మీడియాలో మరికాస్త ముందుకు వెళ్ళి సందీప్ వంగాకు ఇది పెద్ద అవమానం అని, ఇప్పుడు ఈ రిజల్ట్ చూసి ఏ సమాధానం చెప్తావు అని అంటున్నారు. 

ఇక 2001లో నిర్మల్ ప్రదేశ్ అనే గ్రామంలో లాపతా లేడీస్ మూవీ సాగుతుంది. కొత్తగా పెళ్లయిన రెండు జంటల్లో.. ఒకరి భార్య ఒకరికి మారుపోవటమే కీలకాంశం.  దీపక్ కుమార్ (స్పర్శ్ శ్రీవాత్సవ), ఫూల్ (నితాన్షి గోయల్)కు వివాహం అవుతుంది. ఊరికి వెళ్లేందుకు వారిద్దరూ రైలు ఎక్కుతారు. వేరే జంటల పక్కన దీపక్, ఫూల్ కూర్చుంటారు. అయితే, అక్కడ కొత్తగా పెళ్లయిన వధువులకు కూడా ముఖానికి ముసుగు ఉంటుంది. దాదాపు ఒకే రకమైన దుస్తులు ధరించి ఉంటారు. 

అయితే, రైలు దిగే ముందు తొందరలో తన భార్య కాకుండా వేరే వధువు పుష్ప రాణి (ప్రతిభ రత్న) చేయి పట్టుకొని రైలు దిగేస్తాడు దీపక్. ఇంటికి వెళ్లాక వధువు మారిందని అతడు, బంధువులు గుర్తిస్తారు. దీంతో తప్పిపోయిన తన భార్య ఫూల్ కోసం దీపక్ వెతుకుతాడు. మరి అతడికి పూల్ మళ్లీ దొరికిందా.. ఎదురైన పరిస్థితులు ఏవనేదే లాపతా లేడీస్ మూవీలో ముఖ్యమైన అంశాలుగా ఉంటాయి. ఎంటర్‌టైన్‍మెంట్‍తో పాటు సమాజంలో మహిళల ఎదుర్కొంటున్న పరిస్థితులను కూడా ఈ చిత్రంలో మేకర్స్ చూపించారు.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios