పవన్‌ కళ్యాణ్‌ ఫ్యాన్స్ కి డిసెంబర్‌ 31కి అదిరిపోయే సర్‌ప్రైజ్‌ ఇవ్వబోతున్నారు. పవన్‌ క్లాసిక్‌ మూవీస్‌లో ఒకటైన `ఖుషి`ని రీ రిలీజ్‌ చేయబోతున్నారు. 

పవన్‌ కళ్యాణ్‌ బ్లాక్‌ బస్టర్స్ లో టాప్‌ ప్రయారిటీలో ఉంటుంది `ఖుషి` చిత్రం. అప్పట్లో ఇదొక ట్రెండ్‌ సెట్టర్‌. ఈ సినిమా తర్వాత తెలుగు నాట కుర్రాళ్లంతా పవన్‌ మాయలో పడిపోయారు. హెయిర్‌ స్టయిల్‌ నుంచి, వేసే డ్రెస్సుల వరకు పవన్‌ ట్రాన్స్ లో ఉండిపోయారు. స్టూడెంట్స్ పై అంతగా ప్రభావం చూపించిన చిత్రమిది. అందుకే ఇది భారీ విజయాన్ని సాధించింది. పవన్‌ మైల్‌ స్టోన్‌ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. 

పవన్‌ కళ్యాణ్‌ సరసన భూమిక హీరోయిన్‌గా నటించింది. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ అద్భుతంగా పండింది. సిద్దుగా పవన్, భానుమతిగా భూమిక రచ్చ చేశారు. డైలాగ్‌ డెలవరీ, స్టయిల్‌ సైతం ఇందులో హైలైట్‌గా నిలిచింది. రొమాంటిక్‌ కామెంట్‌గా ఎస్‌ జే సూర్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా 2001లో విడుదలైంది. బాక్సాఫీస్‌ని షేక్‌ చేసింది. అప్పట్లోనే ఇది సుమారు 27కోట్లు వసూలు చేయడం విశేషం. ఈ సినిమాతో పవన్‌ స్టార్‌ హీరోగా మారిపోయారు. 

ఈ సినిమా విడుదలై 21ఏళ్లు పూర్తయ్యింది. ఏప్రిల్‌ 27న 2001లో రిలీజ్‌ అయ్యింది. తాజాగా దీన్ని మళ్లీ రీ రిలీజ్‌ చేయబోతున్నారు. ఇప్పుడు తెలుగునాట రీ రిలీజ్‌ల ట్రెండ్‌ కొనసాగుతుంది. హీరోల బర్త్ డేలను పురస్కరించుకుని వారి సూపర్‌ హిట్లని, డిఫరెంట్‌ కాంబినేషన్‌ మూవీస్‌ని రీ రిలీజ్‌ చేస్తున్నారు. అందులో భాగంగా ఇప్పుడు `ఖుషి`ని రిలీజ్‌ చేయబోతున్నారు. ఈ ఇయర్‌ ఎండింగ్‌ సందర్బంగా ఈ చిత్రాన్ని రిలీజ్‌ చేయబోతుండటం విశేషం. డిసెంబర్‌ 31న ఈ సినిమాని రీ రిలీజ్‌ చేయబోతున్నట్టు నిర్మాణ సంస్థ మెగాసూర్య ప్రొడక్షన్‌ వెల్లడించింది.

Scroll to load tweet…

ఏజెస్‌ బ్లాక్‌ బస్టర్‌ ఒరిజినల్‌ లవ్‌ సాగా రీ లైవ్‌ ఎవర్‌ గ్రీన్‌ రొమాన్స్ అంటూ డిసెంబర్‌ 31న మీ సమీప థియేటర్లలో ఎప్పటికీ నిలిచిపోయే మ్యూజికల్‌ లవ్‌ మూవీ `ఖుషి`ని మరోసారి ఆస్వాదించండి` అని పేర్కొన్నారు. ఈ నిర్మాతలే ప్రస్తుతం పవన్‌తో `హరిహర వీరమల్లు` చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. క్రిష్‌ దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. నిధి అగర్వాల్‌ కథానాయికగా నటిస్తుంది.