ఇప్పటికే `నా రోజు నువ్వే` అంటూ సాగే పాటని విడుదల చేశారు. అది యూట్యూబ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. `ఖుషి` సినిమా నుంచి రెండో సాంగ్‌ని విడుదల చేయబోతున్నారు.
విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన `ఖుషి` సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. మరో రెండు మూడు రోజుల్లో ఈ సినిమా టోటల్ షూటింగ్ పూర్తి కాబోతుందని, ఇటీవల టీమ్ పేర్కొన్న విషయం తెలిసిందే. విజయ్ దేవరకొండ కూడా ఈ విషయాన్ని తెలిపారు. ప్రస్తుతం చివరి షెడ్యూల్ జరుగుతుందన్నారు. ఈ నేపథ్యంలో చిత్ర షూటింగ్ పూర్తి కావచ్చింది. మరోవైపు ప్రమోషన్స్ పరంగానూ స్పీడ్ పెంచుతుంది యూనిట్. ఈ సినిమా సెప్టెంబర్ 1న విడుదల కానున్న నేపథ్యంలో ఇప్పటికే `నా రోజు నువ్వే` అంటూ సాగే పాటని విడుదల చేశారు. అది యూట్యూబ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. సమంతని ఉద్దేశించిన విజయ్ దేవరకొండ పాడుకునే పాట అది.
ఇప్పుడు మరో సాంగ్ రాబోతుంది. `ఖుషి` సినిమా నుంచి రెండో సాంగ్‌ని విడుదల చేయబోతున్నారు. `ఆరాధ్య` అంటూ సాగే ఈ పాటకి సంబంధించిన అప్‌డేట్ ఇచ్చింది యూనిట్. ఈ నెల 12(బుధవారం) ఈ పాటని విడుల చేయబోతున్నట్టు తాజాగా విడుదల చేయబోతున్నట్టు తెలిపింది. ఈ సందర్భంగా ఓ కొత్త పోస్టర్‌ని విడుదల చేశారు. ఇందులో విజయ్, సమంత ఎంతో క్యూట్‌గా ఉన్నారు. ఒకరి చేతిని మరొకరు పట్టుకుని నవ్వులు చిందిస్తూ కనిపిస్తున్నారు. వీరిద్దరులో ఘాటు ప్రేమలో ఉన్నారు. త్వరలో రిలీజ్ కాబోతున్న `ఆరాధ్య` పాట రొమాంటిక్ సాంగ్ అని తెలుస్తుంది.
సోమవారం సాంగ్ ప్రోమోని, బుధవారం పాటని విడుదల చేస్తామని తెలిపింది యూనిట్. `ఇప్పటికే 'నా రోజా నువ్వే' అనే పాటు యూట్యూబ్‌లో సెన్సేషన్‌గా మారింది. వంద మిలియన్లకు చేరువలో ఉంది. ఇప్పుడు ఈ సెకండ్ సింగిల్ 'ఆరాధ్య'తో మరో సారి 'ఖుషి' సినిమా ట్రెండ్ అవ్వడం ఖాయం. చార్ట్ బస్టర్ లిస్ట్‌లో ఆరాధ్య పాట కూడా చేరనుంది. హేషమ్ అబ్దుల్ వాహబ్ మ్యూజిక్ ఈ సినిమాకు ప్లస్. తెలుగుతో పాటు తమిళ్, మళయాల, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమాను సెప్టెంబర్ 1న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయనున్నాం.
డాషింగ్ హీరో ది విజయ్ దేవరకొండ, సమంత కలిసి నటిస్తున్న చిత్రం కావడంతో `ఖుషి`పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. లవ్ స్టోరీ, ఎమోషనల్ స్టోరీని తీయడంలో శివ నిర్వాణ మార్క్ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. మరోసారి శివ నిర్వాణ తన మ్యాజిక్ చూపించేందుకు రెడీగా ఉన్నాడు` అని యూనిట్ తెలిపింది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. నవీన్ ఎర్రేని, రవిశంకర్ నిర్మాతలు.
నటీనటులు:
విజయ్ దేవరకొండ, సమంత, జయరాం, సచిన్ ఖేడేకర్, మురళీ శర్మ, లక్ష్మీ, అలీ, శరణ్య పొన్ వణ్నన్, రోహిణి, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, శ్రీకాంత్ అయ్యంగార్, శరణ్య ప్రదీప్ తదితరులు.
టెక్నికల్ టీమ్:
మేకప్ : బాషా
కాస్ట్యూమ్ డిజైనర్స్ : రాజేష్, హర్మన్ కౌర్, పల్లవి సింగ్
ఆర్ట్ : ఉత్తర కుమార్, చంద్రిక
ఫైట్స్ : పీటర్ హెయిన్
రచనా సహకారం : నరేష్ బాబు.పి
పి.ఆర్.వో : జి.ఎస్.కె మీడియా
పబ్లిసిటీ : బాబ సాయి
మార్కెటింగ్ : ఫస్ట్ షో
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : దినేష్ నరసింహన్
ఎడిటర్ : ప్రవీణ్ పూడి
ప్రొడక్షన్ డిజైనర్ : జయశ్రీ లక్ష్మీనారాయణన్
మ్యూజిక్ డైరెక్టర్ : హిషామ్ అబ్దుల్ వాహబ్
డి.ఐ, సౌండ్ మిక్స్ ః అన్నపూర్ణ స్టూడియోస్, విఎఫ్ఎక్స్ మాట్రిక్స్
సి.ఇ.ఓ : చెర్రీ
డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ : జి.మురళి
నిర్మాతలు : నవీన్ యేర్నేని,రవిశంకర్ యలమంచిలి
కథ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం : శివ నిర్వాణ.
