సుమారు 500 లకు పైగా థియేటర్లలో రిలీజ్ అయిన ఈ సినిమాని అభిమానులు ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తో థియేటర్లను దద్దరిల్లుతున్నాయి.
వరస పెట్టి స్టార్ హీరోల సినిమాలు రీరిలీజ్ అయ్యి.. థియేటర్లలో కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నాయి. పాత సినిమాలను లెటెస్ట్ టెక్నాలజీని జోడించి చిన్నచిన్న మార్పులు చేసి మరలా థియేటర్లలో విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన “ఖుషి” సినిమాను కూడా 31 డిసెంబర్ శనివారం రోజున కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేలా రిలీజ్ చేశారు.
ఈ సినిమా రీ రిలీజ్ సందర్భంగా అడ్వాన్స్ బుకింగ్స్ లో దుమ్ము లేపాయి. దాదాపు కోటి రూపాయలకుపైగా అడ్వాన్స్ బుకింగ్స్ అయ్యాయని టాక్. అలాగే ఈ సినిమా ఈ వారం రిలీజైన చిన్న సినిమాల కంటే ఎక్కువ కలెక్షన్లను కొల్లగొడుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఇప్పటికే థియేటర్లలో సందడి చేస్తున్న ఈ మూవీ… ఫ్యాన్స్ హంగామాతో ఓ మానియాను క్రియేట్ చేస్తోంది. సుమారు 500 లకు పైగా థియేటర్లలో రిలీజ్ అయిన ఈ సినిమాని అభిమానులు ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తో థియేటర్లను దద్దరిల్లుతున్నాయి.
ఈ సినిమా పవర్ స్టార్ కెరీర్‌లోనే బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచి, ఎన్నో రికార్డులను నెలకొల్పింది. ఇప్పుడు కూడా ఈ సినిమా రికార్డ్ లు క్రియేట్ చేస్తోంది. ఈ సినిమాకు బెనిఫిట్ షోలు ఉదయం 5 గంటలకు, ఆరు గంటలకు చాలా చోట్ల వేస్తున్నారు. అవన్నీ దాదాపు హౌస్ ఫుల్ అవుతున్నాయి. ఇండియన్ సినీ చరిత్రలోనే ఇలా రీరిలీజ్ కు బెనిఫిట్ షోలు ప్లాన్ చేయటం తొలిసారి అంటున్నారు. ఏదైమైనా 21 ఏళ్ల తర్వాత ఈ సినిమా కొత్త రికార్డ్ లు క్రియేట్ చేయటం మామూలు విషయం కాదు. ఈ నేపధ్యంలో ఈ చిత్రం మరో రికార్డ్ ని క్రియేట్ చేసింది.
అదేమిటంటే... రీరిలీజ్ లు అవుతున్న చిత్రాల్లో ఎక్కువ గ్రాస్ చేసిన చిత్రం ఇదే. ఈ చిత్రం 3.50 గ్రాస్ ప్రపంచ వ్యాప్తంగా వసూలు చేసింది. రీరిలీజ్ లలో వచ్చిన వసూళ్లు చూస్తే..
#Kushi4K - 3.5 Cr +
#Jalsa4K - 3.2 Cr
#Pokiri4K - 1.75 Cr
రొమాంటిక్ లవ్ ఎంటర్‌టైనర్‌గా 2001లో రిలీజ్ అయిన ఈ సినిమా.. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాని శ్రీసూర్య మూవీస్ బ్యానర్‌పై ఏఎమ్ రత్నం నిర్మించగా, ఎస్‌జే సూర్య దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో పవన్ కల్యాణ్ హీరోగా, భూమిక హీరోయిన్‌గా నటించారు. ‘ఖుషి’ సినిమాను కూడా టెక్నాలజీ హంగులు చేర్చి, 4కే రిజల్యూషన్, 5.1 డాల్బీ ఆడియోతో రీరిలిజ్ చేసారు. దీంతో పవన్ అభిమానులు చాలా సంతోషంగా ఉన్నారు.
