Asianet News TeluguAsianet News Telugu

ఈ వారం రిలీజ్ ల పరిస్దితి ఏమిటి?ఏది హిట్

 ఆనంద్ దేవరకొండ నటించిన  `పుష్పక విమానం.`.. యువ హీరో కార్తికేయ నటించిన `రాజా విక్రమార్క`... మళయాళ హీరో దుల్కార్ సల్మాన్ నటించిన `కురుప్` ఒకే రోజు రిలీజ్ అయ్యియి.

kurup dominates pushpaka vimanam,raja vikramarka
Author
Hyderabad, First Published Nov 15, 2021, 12:23 PM IST

ఓటీటిలలో  సినిమాలు రిలీజ్ చేసేస్తున్నారు. థియోటర్ మార్కెట్ పడిపోతుంది అని డిస్ట్రిబ్యూటర్స్,బయ్యర్లు ఓ టైమ్ లో గోలెత్తిపోయారు. అయితే ఇప్పుడు వరసపెట్టి థియోటర్ లో సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అయితే కలెక్షన్స్ మాత్రం నామమాత్రం. సినిమాలు వస్తున్నాయి పోతున్నాయి. ఫలితం ఉండటం లేదు. దాంతో డిస్ట్రిబ్యూషన్ వర్గాలు చాలా డల్ అయ్యిపోయాయి. చిన్న బడ్జెట్ లో తీసి తక్కువ రేట్లకే అమ్మిన చిత్రాలు కూడా కనీసం పెట్టుబడిని కూడా ఇవ్వలేనంత వీక్ గా రన్ అవుతున్నాయి. మొన్న శుక్రవారం వచ్చిన సినిమాలే దీనికి సాక్ష్యం.  ఆనంద్ దేవరకొండ నటించిన  `పుష్పక విమానం.`.. యువ హీరో కార్తికేయ నటించిన `రాజా విక్రమార్క`... మళయాళ హీరో దుల్కార్ సల్మాన్ నటించిన `కురుప్` ఒకే రోజు రిలీజ్ అయ్యియి.

 రాజా విక్రమార్క మొదటి రోజు సుమారుగా 60 లక్షల పైచిలుకు షేర్ కు పరిమితం కాగా పుష్పక విమానం అతి కష్టం మీద 40 లక్షలు దాటింది. ఎలాంటి ఎక్సపెక్టేషన్స్ లేకుండా కేవలం కోటిన్నర లోపే బిజినెస్ చేసుకున్న కురుప్ అనూహ్యంగా 30 లక్షలను దాటింది.  ఈ సినిమాల్లో విజేతగా  `కురుప్` తేలింది. వాస్తవ సంఘటనలు ఆధారంగా తెరకెక్కిన ఈ  సినిమాకు మంచి  టాక్ వచ్చింది. ఫస్టాఫ్  నేరేషన్ కొంచెం ఇబ్బందిపెట్టినా సెకండాఫ్ ,క్లైమాక్స్ కురుప్ కు బాగుందని టాక్ తెచ్చాయి. పక్కా కంటెంట్ బేస్డ్ చిత్రం కావడంతో సినిమాకు కలిసొచ్చింది. ఈ సినిమా మీద ఎలాంటి అంచనాలు లేకుండా తెలుగులో రిలీజ్ అయింది. పబ్లిసిటీ కూడా లేదు. అయినా  సినిమాలో విషయం ఉండటంతో పాజిటివ్ ఫీడ్ బ్యాక్ తో నడుస్తోంది.

గతంలో మాదిరి ప్రేక్షకులు లేరు. ఓటీటి కంటెంట్ లా అనిపించే సినిమాలు ఓటీటిలోనే చూడటానికి ఆసక్తి చూపుతున్నారు. అంతంత మాత్రంగా ఉండే కంటెంట్ ని మేము థియేటర్లలో చూడమని ప్రేక్షకులు స్పష్టంగా తీర్పులిస్తున్నారు. దానికి తగ్గట్లు చిన్న సినిమా అయినా భారీ బడ్జెట్ అయినా అందుకు తగ్గట్టు టికెట్ రేట్లు మారడం లేదు.  అంతకు ముందు వారం వచ్చిన పెద్దన్న, ఎనిమి, మంచి రోజులు వచ్చాయి కూడా నష్టాలు తెచ్చిపెట్టాయి. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ తర్వాత జనాలు పలచగా కనపడుతున్నారు.ఏదైమైనా పెద్ద సినిమాలు రిలీజ్ కావాలి. అంటే పదిహేను రోజులు ఆగి డిసెంబర్ మొదలైతే తప్ప భాక్సాఫీస్ దగ్గర జోష్ వచ్చేలా లేదు.

Follow Us:
Download App:
  • android
  • ios