కింగ్ నాగార్జున, ధనుష్ నటించిన లేటెస్ట్ మూవీ కుబేర. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. జూన్ 20న ఈ చిత్రం థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం సక్సెస్ ఫుల్ మూవీ గా నిలిచింది.

కింగ్ నాగార్జున, ధనుష్ నటించిన లేటెస్ట్ మూవీ కుబేర. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. జూన్ 20న ఈ చిత్రం థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం సక్సెస్ ఫుల్ మూవీ గా నిలిచింది. శేఖర్ కమ్ముల దర్శకత్వం, ధనుష్, నాగార్జున పెర్ఫార్మెన్స్ కి ప్రేక్షకుల నుంచి ప్రశంసలు దక్కాయి.  తెలుగు రాష్ట్రాల్లో కుబేర చిత్రం మంచి విజయం సాధించింది. బిచ్చగాడి పాత్రలో ధనుష్ కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చారు. నాగార్జున మాజీ సీబీఐ అధికారిగా నటించారు. ఇక రష్మిక కూడా కీలక పాత్రలో మెరిసింది. 

ఈ చిత్ర ఓటీటీ రిలీజ్ గురించి చాలా రోజులుగా అనేక ఊహగానాలు సోషల్ మీడియాలో వైరల్  అవుతున్నాయి. ఆ ఊహాగానాలకు చెక్ పెడుతూ అధికారికంగా ఓటీటీ రిలీజ్ డేట్ ప్రకటించారు. ఊహించని విధంగా ఈ చిత్రం నెల రోజుల్లోపే ఓటీటీలో స్ట్రీమింగ్ మొదలు కానుంది. అమెజాన్ ప్రైమ్ లో కుబేర చిత్రం జూలై 18 నుంచి స్ట్రీమింగ్ మొదలుకానుంది. థియేటర్లలో సత్తా చాటిన ఈ చిత్రం ఓటీటీ వేదికపై ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుంది అనేది ఆసక్తిగా మారింది.

 

Scroll to load tweet…

 

ఈ మూవీలో జిమ్ సౌరభ్ విలన్ గా నటించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ సాగర్ ప్రాజెక్టులో విలన్ భారీ స్కాంకి పాల్పడతాడు. లక్ష కోట్ల డీల్ కుదురుతుంది. అందులో 50 వేల కోట్లు బ్లాక్ లో, మరో 50 వేల కోట్లు వైట్ లో ఇచ్చేలా ఒప్పందం కుదురుతుంది. దీనికోసం నీరజ్(జిమ్ సౌరభ్) మాజీ సీబీఐ అధికారి దీపక్(నాగార్జున) సహాయం తీసుకుంటారు. వీళ్లు అనుకున్నది జరగడం కోసం దీపక్ బిచ్చగాళ్లను ఎంచుకుంటాడు. ఆ బిచ్చగాళ్ళలో ఒకరైన ధనుష్.. ఎలా తప్పించుకున్నాడు, వారితో ఎలా పోరాడాడు అనేదే ఈ చిత్ర కథాంశం.