భీమ్లా నాయక్(Pawan Kalyan) ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిన్నసాయంత్రం హైదరాబాద్ లోని పోలీస్ గ్రౌండ్స్ లో ఘనంగా జరిగింది. ఈ ఈవెంటెంట్ కు ముఖ్య అతిధిగా వచ్చారు.. తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్(KTR). ఇక ఈరోజు ఈవెంట్ గురించి ట్వీట్ చేశారు మంత్రి.

భీమ్లా నాయక్(Pawan Kalyan) ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిన్నసాయంత్రం హైదరాబాద్ లోని పోలీస్ గ్రౌండ్స్ లో ఘనంగా జరిగింది. ఈ ఈవెంటెంట్ కు ముఖ్య అతిధిగా వచ్చారు.. తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్(KTR). ఇక ఈరోజు ఈవెంట్ గురించి ట్వీట్ చేశారు మంత్రి.

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan), రానా(KTR) కాంబినేషన్ మూవీ భీమ్లా నాయక్ రేపు( ఫిబ్రవరి 25) పెద్ద ఎత్తున రిలీజ్ కాబోతోంది. ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ నిన్న(23 ఫిబ్రవరి) హైదరాబాదులో జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సినిమా ఘన విజయం సాధించాలని ఆకాంక్షించారు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Pawan Kalyan) అంటే ఇష్టపడని వారు ఉండరూ.. ఆయన సినిమాల గురించి ఎంత చెప్పినా తక్కువే అన్నారు కేటీఆర్. పవన్ కల్యాణ్ తొలి ప్రేమ సినిమా తాను కాలేజీ రోజుల్లు చాలా సార్లు చూశానన్నారు మంత్రి కేటీఆర్(KTR). అప్పటి నుంచి ఇప్పటి భీమ్లా నాయక్ వరకూ దాదాపు 26 సంవత్సరాలు.. ఇంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ ను మెయింటేన్ చేయడం గొప్ప విషయమన్నారు.


ఇక ఈరోజు మంత్రి కేటిఆర్ (KTR) ట్విట్టర్ ద్వారా భీమ్లా నాయక్ ఈవెంట్ గురించి స్పందించారు. తన సోదరులు పవన్ కల్యాణ్, దగ్గుబాటి రానా(Rana), తమన్, సాగర్ చంద్రల సినిమా భీమ్లా నాయక్ రిలీజ్ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేయడానికి రొటీన్ నుంచి కొంత విరామం తీసుకున్నానని ఆయన అన్నారు. అంతే కాదు మొగిలయ్య, శివమణి వంటి బ్రిలియంట్ సంగీత విద్వాంసులను కలుసుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు.

Scroll to load tweet…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) , రానా(Rana) హీరోలుగా నిత్యా మీనన్, సంయుక్తా మీనన్ హీరోయిన్లుగా సాగర్ కే చంద్ర డైరెక్షన్ లో తెరకెక్కిన భీమ్లానాయక్ మూవీలో సముద్రఖని,మురళీ శర్మ లాంటి సీనియర్లు నటించారు. భీమ్లా నాయక్ మూవీకి స్క్రీన్ ప్లే.. డైలాగ్స్ ను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అందించారు.

మొదటి నుంచి పవర్ స్టార్ ప్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్న భీమ్లా నాయక్ ( Bheemla Nayak) సినిమాను ఫిబ్రవరి 25న.. ప్రపంచ వ్యాప్తంగా.. దాదాపు 3 వేల థియేటర్లు.. 10 వేలకు పైగా స్క్రీన్స్ లో రిలీజ్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే తెలంగాణాలో ఈమూవీ 5 షోలకు అనుమతి లభించింది. రెండు వారాల పాటు రోజుకు 5 షోలు వేసుకోవడానికి అనుమతి లభించింది.