రెండో రోజే బస్సులో ఆ సినిమా.. ఫైర్ అయిన కేటీఆర్

KTR Fires on Tsrtc
Highlights

రెండో రోజే బస్సులో ఆ సినిమా.. ఫైర్ అయిన కేటీఆర్

టీఎస్ఆర్టీసీకి చెందిన గరుడ బస్సులో కొత్త సినిమాల పైరసీలను ప్రదర్శిస్తుండటంపై మంత్రి కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. తాను బెంగళూరు నుంచి హైదరాబాద్ వస్తున్న వేళ, గరుడ సర్వీసులో ఈ సినిమాను ప్రదర్శించారని సునీల్ అనే యువకుడు కేటీఆర్ ను ట్యాగ్ చేస్తూ, సినిమా స్క్రీన్ షాట్ ను జోడించి ట్వీట్ చేశాడు. 

సినిమా విడుదలైన రెండో రోజే ఈ ఘటన జరిగిందని చెప్పాడు. ఇక దీనిపై స్పందించిన కేటీఆర్, టీఎస్ఆర్టీసీ ఉద్యోగులు చేసిన పని బాధ్యతారాహిత్యమని అన్నారు. సంస్థలో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ ను కోరుతున్నట్టు తెలిపారు. 

loader