'మహానటి' చిత్రానికి ప్రేక్షకాదరణ దక్కుతోంది. అన్ని వర్గాల ప్రేక్షకులకు ఈ సినిమా చక్కటి అనుభూతిని కలిగిస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లో కూడా ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది. అమెరికాలో ప్రివ్యూల ద్వారా ఈ సినిమా రూ.1.54 కోట్లను రాబట్టింది. టాలీవుడ్ కు చెందిన ప్రముఖులు ఈ సినిమాపై ప్రశంసలు కురిపిస్తూనే ఉన్నారు. తాజాగా తెలంగాణా మినిస్టర్ కెటీఆర్ కూడా ఈ సినిమాపై కామెంట్ చేశారు. పెద్ద స్టార్ హీరోల సినిమాలు ఏది విడుదలైనా మొదటిరోజే చూసి తన అభిప్రాయాన్ని సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకుంటారు కెటీఆర్. 

'మహానటి' సినిమాను చూసిన ఆయన ఈ సినిమా ఒక అద్భుతమని అన్నారు. మహానటి ఓ మంచి అనుభవాన్ని మిగిల్చిందని, కీర్తి సురేష్ హన పాత్రలో స్టన్నింగ్ పెర్ఫార్మన్స్ కనబరిచిందని అన్నారు. నాగ్ అశ్విన్ అద్భుత దర్శకత్వ ప్రతిభకు నా అభినందనలు.. సమంత, విజయ్ దేవరకొండ, నాగచైతన్య, స్వప్నా దత్ లకు నా శుభాకాంక్షలు అని వెల్లడించారు.