Asianet News TeluguAsianet News Telugu

పద్మావతి వివాదంలోకి బాహుబలి ప్రభాస్ ను లాగుతున్నారు

  • గత కొంత కాలంగా వివాదానికి కేంద్ర బిందువుగా మారిన పద్మావతి చిత్రం
  • దీపికా పడుకునె లీడ్ రోల్ లో సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన పద్మావతి
  •  రాణి పద్మావతిని కించపరుస్తూ చిత్రీకరిస్తున్నారంటూ రాజ్ పుత్ కర్ణిసేన అభ్యంతరం
  • పద్మావతి చిత్రం వివాదంలోకి బాహుబలి ప్రభాస్ ను లాగేందుకు ప్రయత్నిస్తున్న క్షత్రియులు
kshatriya sangh pulls prabhas into padmavathi controversy

సంజయ్ లీలా భన్సాలీ రూపొందించిన పద్మావతి చిత్రం విడుదల కానిచ్చేదే లేదని.. శ్రీ రాజ్‌పుత్ కర్నిసేన లాంటి సంస్థలు తేల్చి చెప్తున్నాయి. పద్మావతి చిత్రంలో నటించిన దీపికా పదుకొనె, దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీపై దాడి చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని కొన్ని సంస్థలు బహిరంగ ప్రకటన చేశాయి. దీపికా పదుకొనె ముక్కు కోసిన వారికి 5 కోట్ల బహుమానం అందజేస్తామని ప్రకటించారు. అంతేకాకుండా భన్సాలీ తల తెగ నరికిన వారికి రూ.10 కోట్ల రూపాయలు బహుమానంగా ఇస్తామన్నారు. ఇదిలా వుంటే.. తాజాగా ఈ వివాదంలోకి బాహుబలి ప్రభాస్‌ను లాగడం కొత్త మలుపు తిరిగింది.

 

పద్మావతి వివాదం రాజస్థాన్, బీహార్, మధ్యప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలను కుదిపేస్తున్నది. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పద్మావతికి వ్యతిరేకంగా మాట్లాడుతుండగా, బీజేపీయేతర రాష్ట్రాల్లో పద్మావతికి అనుకూలంగా మద్దతు తెలుపుతున్నారు. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు పద్మావతిని వివాదం చేసి అడడ్డుకోవడం, ముక్కు కోస్తాం, తలతీస్తాం అంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడంపై తీవ్రంగా స్పందిస్తున్నారు. కమల్, ప్రకాశ్ రాజ్ లాంటి దక్షిణాది స్టార్స్ ఇప్పటికే పద్మావతి మూవీకి దన్నుగా నిలిచారు. పద్మావతి వివాదం నేపథ్యంలో దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ పరిస్థితులు నెలకొన్నాయని బెంగాల్ సీఎం మమత బెనర్జీ మండిపడ్డారు.

 

మరోవైపు పద్మావతి వివాదంలోకి బాహుబలితో జాతీయవ్యాప్తంగా గుర్తింపు పొందిన ప్రభాస్‌ను లాగేందుకు ఆల్ క్షత్రియ మహాసభ అనే సంస్థ ప్రయత్నించింది. పద్మావతి వివాదంపై ప్రభాస్ మాట్లాడాలని, తమ సామాజిక వర్గం మనోభావాలు కించపరిచే విధంగా ఉన్న ఈ చిత్రాన్ని ఖండించాలని ఆ సంస్థ ప్రతినిధులు ప్రకటన చేశారు. ఉత్తరాది టెలివిజన్ ఛానెళ్లు ఈ వార్తను విస్తృతంగా ప్రచారం చేశాయి. పద్మావతి చిత్రంపై ప్రభాస్ మాట్లాడాలి అని ఓ వర్గం డిమాండ్ చేయటంతో ప్రభాస్ వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్ అయింది.

 

ఇంతకీ పద్మావతి వివాదంతో ప్రభాస్ కు సంబంధం ఏంటంటే... ప్రభాస్ కూడా క్షత్రియ వంశానికి చెందిన వాడు కావడమే ఆల్ క్షత్రియ మహాసభ ప్రతినిధుల డిమాండ్ కు కారణమైంది. దేశవ్యాప్తంగా క్షత్రియులు ప్రభాస్‌ మనవాడనే ఫీలింగ్‌తో ఉన్నట్టు స్పష్టంగా తెలుస్తోంది.

 

పద్మావతి వ్యవహారంలోకి ప్రభాస్‌ను లాగడంతో అప్రమత్తమైన రెబెల్ స్టార్ కృష్ణంరాజు... వెంటనే పద్మావతిపై ఎలాంటి ప్రకటన గానీ, ఏ విధమైన స్పందనగానీ చూపించవద్దని ప్రభాస్‌కు సూచించారట. ప్రభాస్ ఏం మాట్లాడినా అతనికి నష్టం కలిగించే విధంగా ఉంటుందనే కృష్ణంరాజు... ప్రభాస్ కెరీర్‌కు ఎలాంటి ముప్పు కలగకుండా జాగ్రత్త పడ్డారట.

Follow Us:
Download App:
  • android
  • ios