టాలీవుడ్ యువ దర్శకులు మంచి సక్సెస్ లతో బడా ప్రొడక్షన్స్ ని ఆకర్షిస్తున్నారు. 2016లో వచ్చిన క్షణం సినిమా ఏ స్థాయిలో విజయాన్ని అందుకుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అయితే సినిమాను తెరకెక్కించిన యువ దర్శకుడు రవికాంత్ ఆ తరువాత సురేష్ బాబు నుంచి మంచి అఫర్ అందుకున్నాడు. 

సిల్లీ మంకీస్ కూడా అతని రెండవ సినిమాకు నిర్మాతగా ఒప్పుకోవడంతో ఒక ప్రయోగాత్మకమైన రొమాంటిక్ డ్రామాను ప్లాన్ చేసుకున్నాడు. ఇప్పటికే సినిమా షూటింగ్ ఎండింగ్ కు వచ్చేసినట్లు తెలుస్తోంది. సైలెంట్ గా షూటింగ్ ఫినిష్ చేసుకుంటున్న ఈ సినిమా టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ ని త్వరలో రిలీజ్ చేయనున్నారు. 

వీలైనంత త్వరగా పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసి రెగ్యులర్ ప్రమోషన్స్ స్టార్ట్ చేయాలనీ చిత్ర యూనిట్ ప్లాన్ చేసుకుంటోంది. సిద్దు జొన్నలగడ్డ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో శ్రద్దా శ్రీనాథ్ కథానాయిక. అలాగే ఈ ప్రాజెక్ట్ ద్వారా సరికొత్త టాలెంటెడ్ నటీనటులు టాలీవుడ్ కి పరిచయం కాబోతున్నట్లు సమాచారం.