స్టార్ హీరోలపై కృతి కామెంట్స్ ఫ్యాన్స్ ని ఫిదా చేస్తున్నాయి. తమ అభిమాన హీరో గురించి బేబమ్మ చెప్పిన మాటలకు అభిమానులు మురిసిపోతున్నారు. ముఖ్యంగా మహేష్, పవన్ కళ్యాణ్ గురించి ఆమె ఆసక్తికర కామెంట్స్ చేశారు.  


కృతి శెట్టి లేటెస్ట్ మూవీ 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి'. సెప్టెంబర్ 16న వరల్డ్ వైడ్ విడుదల చేశారు. ఈ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా కృతి శెట్టి అభిమానులతో ముచ్చటించారు. వారు అడిగిన అనేక ప్రశ్నలకు సహనంగా సమాధానాలు చెప్పారు. సాధారణంగా ఓ హీరోయిన్ ఆన్లైన్లోకి వస్తే స్టార్ హీరోల అభిమానులు తమ హీరో గురించి కామెంట్ చేయాలని అడుగుతారు. ఈ క్రమంలో అజిత్, విజయ్, అల్లు అర్జున్, రామ్ చరణ్ ఇలా పలువురు స్టార్స్ కి సంబంధించిన ఫ్యాన్స్ కృతి అభిప్రాయం అడిగి తెలుసుకున్నారు. 

అల్లు అర్జున్ ని ఐకాన్ స్టార్ అంటూ పొగిడిన కృతి, రామ్ చరణ్ ని అడ్మైర్ చేస్తాను అన్నారు. అజిత్ జెన్యూన్ పర్సన్ అని చెప్పిన కృతి... విజయ్ ఇన్స్పిరేషనల్ స్టార్ అన్నారు. కాగా మహేష్ ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నకు ఆమె ఇచ్చిన సమాధానం ప్రత్యేకంగా నిలిచింది. మహేష్ ని ఆమె రియల్ అండ్ రీల్ సూపర్ స్టార్ గా చెప్పుకొచ్చారు. ఆన్ స్క్రీన్ పైనే కాకుండా రియల్ లైఫ్ లో కూడా ఆయన సూపర్ స్టారే అని చెప్పి ఫ్యాన్స్ లో ఉత్సాహం నింపారు. 

ఇక పవన్ కళ్యాణ్ గురించి చెప్పమనగా... మీకు లాగే నేను కూడా ఆయన అభిమానిని అని కృతి చెప్పారు. మొత్తంగా స్టార్ హీరోలను ఓ రేంజ్ లో ఎలివేట్ చేసిన కృతి సమాధానాలు ఫ్యాన్స్ ని ఆనందంలో ముంచెత్తాయి. మరోవైపు ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి మూవీ మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. సుధీర్ బాబు హీరోగా నటించిన ఈ చిత్రానికి మోహన కృష్ణ ఇంద్రగంటి దర్శకుడు. 

కాగా కృతి గత రెండు చిత్రాలు ది వారియర్, మాచర్ల నియోజకవర్గం డిజాస్టర్స్ అయ్యాయి. దీంతో అమ్మడు కొంచెం డీలా పడ్డారు. ఇక ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి రిజల్ట్ ఏమిటో వీకెండ్ ముగిశాక తెలుస్తుంది. ప్రస్తుతం కృతి నాగ చైతన్యకు జంటగా వెంకట్ ప్రభు డైరెక్షన్ లో ఓ మూవీ చేస్తున్నారు. అలాగే సూర్యకి జంటగా ఓ తమిళ చిత్రంలో నటిస్తున్నారు.