మహేష్ హీరోయిన్.. ఆన్ లైన్ బాధితురాలు!

Kriti Sanon's Giraffe Photo for Cosmo India Sparks Controversy Online
Highlights

 ఓ ఫ్యాషన్ మ్యాగజైన్ కోసం కృతి ఫోటో షూట్ లో పాల్గొంది. ఆమె కాస్ట్యూమ్స్, మేకప్ అన్నీ బాగున్నప్పటికీ బ్యాక్ గ్రౌండ్ లో జిరాఫీ బొమ్మని పెట్టడం అభిమానుల ఆగ్రహానికి కారణమైంది. పైగా.. ఈ ఫోటోను షేర్ చేస్తూ.. మహిళల వేధింపులకు సంబంధించిన క్యాప్షన్ పెట్టారు

సూపర్ స్టార్ మహేష్ బాబుని గౌరవంగా సంబోధించలేదని ఆయన అభిమానులు ఇటీవల నటి శోభిత దూళిపాళ్లపై విరుచుకుపడిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు మహేష్ బాబు హీరోయిన్ ని నెటిజన్లు టార్గెట్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. మహేష్ బాబుతో కలిసి 'వన్ నేనొక్కడినే' సినిమాలో నటించింది కృతి సనన్. ఆ తరువాత బాలీవుడ్ కి వెళ్లిపోయింది. తాజాగా ఈ బ్యూటీ ఓ ఫోటో షూట్ లో పాల్గొంది.

ఫోటోల కోసం ఆమె ఇచ్చిన పోజు ఇప్పుడు ఆమెను ఇబ్బందుల్లో పడేసింది. ఓ ఫ్యాషన్ మ్యాగజైన్ కోసం కృతి ఫోటో షూట్ లో పాల్గొంది. ఆమె కాస్ట్యూమ్స్, మేకప్ అన్నీ బాగున్నప్పటికీ బ్యాక్ గ్రౌండ్ లో జిరాఫీ బొమ్మని పెట్టడం అభిమానుల ఆగ్రహానికి కారణమైంది. పైగా.. ఈ ఫోటోను షేర్ చేస్తూ.. మహిళల వేధింపులకు సంబంధించిన క్యాప్షన్ పెట్టారు. దీంతో ఈ ఫోటోపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.

'మహిళలకు ఎదుర‌వుతున్న హింస గురించి మాట్లాడుతున్న మీరు.. జంతువుల‌ను హింసించ‌డాన్ని ప్రోత్స‌హిస్తున్నారా..?' అంటూ ఆమెపై విరుచుకుపడుతున్నారు. కొంతమైంది ఏకంగా ఫిర్యాదు చేస్తామని కూడా బెదిరించారు. 

 

loader