మహేష్ బాబు - 1 నేనొక్కడినే సినిమాతో వెండితెరకి పరిచయమైన కృతి సనోన్ మొత్తానికి తన టాలెంట్ తో మంచి అవకాశాలను అందుకుంటోంది. మొదటి సినిమా టాలీవుడ్ లో డిజాస్టర్ అయినప్పటికీ బాలీవుడ్ లో జయాపజయాలతో సంబంధం లేకుండా రెమ్యునరేషన్ పెంచుకుంటోంది. 

త్వరలోనే ఒక బోల్డ్ కంటెంట్ ఉన్న కథలో నటించబోతున్నట్టు కృతి వివరణ ఇచ్చింది. సరోగసి ఆ సినిమాలో మెయిన్ కాన్సెప్ట్ అని ఇంటర్వ్యూలో వివరణ ఇచ్చిన కృతి డిఫరెంట్ లుక్ తో కనిపించనున్నట్లు తెలిపింది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న ఆ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే స్టార్ట్ కానుంది. 

లుక్కా ఛుప్పి సినిమాతో బాక్స్ ఆఫీస్ వద్ద మంచి హిట్టందుకున్న కృతి రెమ్యునరేషన్ ని కూడా 2 కోట్లకు పెంచినట్టు టాక్ వచ్చింది. అమ్మడికి క్రేజ్ పెరగడంతో సినిమా కంటెంట్ ను బట్టి పారితోషికం డిమాండ్ చేస్తున్నట్లు కథనాలు వెలువడ్డాయి. ఇక సరోగసి కాన్సెప్ట్ తో వస్తోన్న కొత్త సినిమా కోసం అమ్మడు మంచి ఎమౌంట్ అందుకున్నట్లు సమాచారం.