జాతీయ అవార్డ్ వచ్చిన సందర్భంగా ఆనందంలో మునిగి తేలుతోంది బాలీవుడ్ హీరోయిన్ కృతీ సనన్. తాజాగా ఆమె శ్రీ సిద్ది వినాయకుడిని దర్శించుకుంది.  


జాతీయ అవార్డ్ వచ్చిన సందర్భంగా ఆనందంలో మునిగి తేలుతోంది బాలీవుడ్ హీరోయిన్ కృతీ సనన్. తాజాగా ఆమె శ్రీ సిద్ది వినాయకుడిని దర్శించుకుంది. 

టాలీవుడ్ నుంచి హీరోయిన్ గా ఎదిగి.. బాలీవుడ్ చేరింది కృతీ సనన్. మహేష్ బాబుతో వన్ నేనొక్కడినే సినిమాలో సందడి చేసింది. కాకపోతే టాలీవుడ్ లో స్టార్ డమ్ అందుకోలేకపోయింది. బాలీవుడ్ లో మాత్రం స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది. తాజాగా జాతీయ అవార్డ్ ను సాధించింది కృతి సనన్. మీమీ సినిమ‌తో భారీ విజయం సాధించింది న‌టి కృతిసనన్‌. లక్ష్మణ్‌ ఉటేకర్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కృతి సరోగేట్‌ మదర్‌గా నటించి.. తన నటనతో అంద‌రిని మెప్పించింది. తాజాగా ఈ సినిమాలో కృతి నటనకు గాను ఉత్తమ నటిగా జాతీయ అవార్డు అందుకుంది. 

Scroll to load tweet…

ఇక జాతీయ అవార్డ్ అందుకున్న సంద‌ర్భంగా ముంబైలోని ప్రసిద్ధమైన సిద్ధి వినాయక మందిరాన్ని శ‌నివారం కృతి దర్శించుకుంది. సిద్ది వినాయక స్వామి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించింది కృతి. ఎలాంటి హడావుడి లేకుండా సాధారణ‌ భక్తురాలిగా వ‌చ్చిన బాలీవుడ్ స్టార్ హీరోయిన్.. సిద్ది వినాయక స్వామికి ప్రత్యేక మొక్కులు చెల్లించారు. ఇక కృతిసనన్‌ వినాయక మందిరానికి వచ్చిందని తెలుసుకున్న చుట్టుపక్కల జనాలు.. కృతీ అభిమానులు ఆమెను చూసేందుకు ఎగబడ్డారు. 

Scroll to load tweet…

ప్ర‌స్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. జాతీయ అవార్డ్ సాధించడంతో కృతీ సనన్ కు దేశ వ్యాప్తంగా శుభాకాంక్షలు వెల్లువల వచ్చాయి. స్టార్ సెలబ్రిటీలు ఆమెను అభినందిస్తూ.. ట్వీట్లు చేశారు. కృతీకి క్లోజ్ గా ఉన్న స్టార్స్ పర్సనల్ గా విష్ చేశారు. ఇకఈ మధ్యనే ఆదిపురుష్ సినిమాలో ప్రభాస్ సరసన నటించింది కృతీ. సీత పాత్రలో అద్భుత నటనను ప్రదర్శించింది.