Krithi shetty : ధైర్యం చేసిన కృతి శెట్టి.. ప్రయోగం చేయబోతోంది.. మరో బంపర్ ఆఫర్ కొట్టేసింది...
వరుస ఆఫర్లతో రెచ్చిపోతోంది యంగ్ హీరోయిన్ కృతి శెట్టి. తగ్గేదే లేదంటుంది.. కెరీర్ బిగినింగ్ లోనే ప్రయోగానికి రెడీ అయిపోయింది ఉప్పెన భామ.
వరుస అవకాశాలతో దూసుకుపోతోంది ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి(Krithi Shetty). ఒక్క సినిమా తన ఫేట్ ను మార్చేసింది. ఉప్పెన సినిమాతో కుర్ర కారు గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన కృతి.ఈ సినిమా తరువాత వరుస అవకాశాలను అందుకుంటుంది. ఇప్పటికే తన ఖాతాలో ఐదు సినిమాలు ఉండగా.. మరో క్రేజీ ప్రాజెక్ట్ కు ఆమె సైన్ చేసినట్టు తెలుస్తోంది. 18 ఏళ్లకే ఇన్ని అవకాశాలు అందుకుని ఈరేంజ్ లో దూసుకుపోతున్న కృతి శెట్టి ఈ సారి ప్రయోగాత్మక సినిమా చేయబోతున్నట్టు సమాచారం. అది కూడా ఓపెద్ద బేనర్ లో చేయనున్నట్టు తెలుస్తోంది.
ఇప్పటికే కృతి శెట్టి నానికి జంటగా నటించిన శ్యామ్ సింగరాయ్ ఈనెల 24న రిలీజ్ కు రెడీగా ఉంది. అటు సుధీర్ బాబుతో చేస్తోన్న ఆ అమ్మాయి గురించి చెప్పాలి సినిమా షూటింగ్ లాస్ట్ స్టేజ్ లో ఉంది. రేపో మాపో రిలీజ్ కు రెడీ అవుతుంది. అటు కల్యాణ్ క్రిష్ణ డైరెక్షన్ లో నాగచైతన్యకు జోడీగా బంగార్రాజులో రచ్చ చేయబోతోంది కృతి. ఈమూవీ సంక్రాంతి బరిలో నిలిచే అవకాశం ఉంది. ఇవి కాకుండా యంగ్ హీరో నితిన్ జంటగా మాచర్ల నియోజకవర్గం సినిమాతో పాటు ఎనర్జటిక్ స్టార్ రామ్ కు జోడీగా మరో సినిమా చేస్తోంది కృతి.
ఇన్ని సినిమాలు వెనకేసుకున్న కృతి శెట్టి.... మరో పెద్ద ప్రాజెక్ట్ కూడా లైన్ లో పెట్టేసిట్టు ఇండస్ట్రీ టాక్ .అది కూడా లేడీ ఓరియోంటెడ్ మూవీ అని తెలుస్తోంది. చాలా మంది హీరోయిన్లు.. కెరీర్ అయిపోతుంది అనుకున్న టైమ్ లో ఉమెన్ సెంట్రిక్ మూవీస్ వైపు అడుగులు వేస్తారు. కాని కెరీర్ బిగినింగ్ లోనే ఈ హీరోయిన్ విమెన్ ఓరియెంటెడ్ సబ్జెక్ట్ ను తీసుకున్నట్టు సమాచారం. అది కూడా పెద్ద పేరున్న బ్యానర్ లో .. సీనియర్ డైరెక్టర్ తో ఈ సినిమా తెరకెక్కబోతున్నట్టు టాక్. ముఖ్యంగా ఈ సినిమా కథ నచ్చడంతో కృతి ఈ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. అయితే ఈ సినిమా గురించి అఫీషియల్ అనౌన్స్ మెంట్ మాత్రం ఇప్పటి వరకూ రాలేదు. త్వరలో ప్రకటన చేస్తారని తెలుస్తోంది. మరి కృతి శెట్టి చేయబోయే ఆ సినిమా ఏంటి...ఆమెను కట్టిపడేసిన కథ ఏంటి...? సినిమా చేయబోతున్న సీనియర్ డైరెక్టర్ ఎవరు.. ? ఆ పెద్ద బ్యానర్ ఏది అనేది తెలియాలంటే ఎదురు చూడక తప్పదు.
Also read : RRR:ట్రిపుల్ ఆర్ హీరోలకు రాజమౌళి టార్చర్.... తట్టుకోలేకపోయామన్న హీరోలు.