`అనవసరంగా ఎవరూ ఇంటి దాటి బయటకు వెళ్లొద్దు. నా సొంత అనుభవంతో చెబుతున్నా. మేం రెండు రోజులు ప్రత్యక్ష నరకం అనుభవించాం` అని చెబుతోంది పవన్‌ హీరోయిన్‌ కృతి కర్బందా. తెలుగులో పవన్‌తో `తీన్‌మార్‌`, రామ్‌చరణ్‌ `బ్రూస్‌లీ`, `ఒంగోలు గిత్త` చిత్రాల్లో నటించి తెలుగు ఆడియెన్స్ ని ఆకట్టుకుంది కృతి కర్బందా. ఇటీవల తమ ఫ్యామిలీ కరోనా బారిన పడిన నేపథ్యంలో మాలాంటి పరిస్థితి ఎవరికీ రావద్దని తెలిపింది. ఈ మేరకు ఆమె ట్వీట్‌ చేసింది.

`గత 48గంటల్లో నేను, నా కుటుంబ సభ్యులు ఎంతో నరకం అనుభవించాం. మీకు అనుభవమయ్యే వరకు ఆ బాధ ఎలా ఉంటుందో మీకు తెలియదు. కాబట్టి దయజేసి ఇంట్లోనే ఉండండి. మీరు బయటకు వెళ్లాలనుకున్నప్పుడు మీ ప్రాణాన్ని రిస్క్ లో పెడుతున్నారని గ్రహించి వెనకడుగు వేయండి. మీ ప్రాణాలను, జీవితాలను లైట్‌గా తీసుకోకండి` అని కృతి తెలిపింది. దీంతో తమ ఫ్యామిలీ కూడా కరోనాకి గురైనట్టు చెప్పింది కృతి. 

ప్రస్తుతం బాలీవుడ్‌ చిత్రాలతోనే బిజీగా ఉన్న ఈ అమ్మడు చివరగా `హౌజ్‌ఫుల్‌4`, `పాగల్‌పంటి` చిత్రాల్లో మెరిసింది. ప్రస్తుతం `వాన్‌`, `14ఫేర్‌` చిత్రాల్లో నటిస్తుంది. పలువురు స్టార్‌ హీరోలు కూడా  కరోనా బారిన పడిన విషయం తెలిసిందే.