ప్రస్తుతం ప్రపంచం మొత్తం ఆర్ఆర్ఆర్ చిత్ర మ్యానియా సాగుతోంది. ఒక తెలుగు చిత్రాన్ని ఇంత ఘనంగా అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన రాజమౌళికి సినీ జనం నీరాజనాలు పడుతున్నారు.
ప్రస్తుతం ప్రపంచం మొత్తం ఆర్ఆర్ఆర్ చిత్ర మ్యానియా సాగుతోంది. ఒక తెలుగు చిత్రాన్ని ఇంత ఘనంగా అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన రాజమౌళికి సినీ జనం నీరాజనాలు పడుతున్నారు. ఆర్ఆర్ఆర్ చిత్రంలో నటించిన రాంచరణ్, ఎన్టీఆర్ ప్రశంసలు అందుకుంటున్నారు.
ఆర్ఆర్ఆర్ టీం ఎక్కడ అడుగుపెట్టినా అవార్డులు దాసోహం అవుతున్నాయి. అనేక అవార్డులతో పాటు గోల్డెన్ గ్లోబ్ అవార్డు కూడా ఆర్ఆర్ఆర్ చిత్రం గెలుచుకుంది. కానీ యావత్ దేశం మొత్తం ఎదురుచూస్తోంది మాత్రం ఆస్కార్ అవార్డు కోసం. నాటు నాటు సాంగ్ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్స్ ఫైనల్ నామినేషన్స్ లో చోటు దక్కించుకున్న సంగతి తెలిసిందే.
తాజాగా ఆర్ఆర్ఆర్ చిత్ర ఆస్కార్స్ అంచనాలపై కృష్ణం రాజు సతీమణి శ్యామలాదేవి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆర్ఆర్ఆర్ చిత్రం హెచ్ సి ఏ అవార్డ్స్ లో హవా కొనసాగించింది అని తెలిసి చాలా సంతోషించా. ఉత్తమ యాక్షన్ చిత్రం, ఉత్తమ అంతర్జాతీయ చిత్రం, ఉత్తమ స్టంట్స్, బెస్ట్ ఒరిజినల్ సాంగ్ , స్పాట్ లైట్ అవార్డు విభాగాల్లో ఆర్ఆర్ఆర్ చిత్రం అవార్డులు గెలుచుకుందని తెలిసింది. ఇదంతా చూస్తుంటే మనకి ఆస్కార్ అవార్డు దగ్గర్లోనే ఉందనిపిస్తోంది అని శ్యామలాదేవి జోస్యం చెప్పారు.
ఈ ఘనత సాధించిన రాజమౌళి గారికి, చిరంజీవులు రామ్ చరణ్, ఎన్టీఆర్ లకు నా శుభాభినందనలు. సంగీతం అందించిన కీరవాణి గారు సహా సినిమా కోసం పని చేసిన అందరికీ శుభాకాంక్షలు. అలాగే టీం మొత్తానికి కృష్ణం రాజుగారి ఆశీస్సులు కూడా ఉంటాయి అని శ్యామలాదేవి అన్నారు.
అలాగే లెజెండ్రీ డైరెక్టర్ కె విశ్వనాథ్ గారి సతీమణి జయలక్ష్మి మృతి పట్ల ఆమె విచారం వ్యక్తం చేశారు. తండ్రిని కోల్పోయిన పిల్లలు వెంటనే తల్లి కూడా దూరం అయితే ఆ బాధ ఎలా ఉంటుందో తెలుసు అని శ్యామలాదేవి తెలిపారు.
