ఎన్టీఆర్ బయోపిక్ కథానాయకుడు మొత్తానికి బయ్యర్స్ ని ముంచేలా కనిపిస్తోంది. యూఎస్ లో కూడా సినిమా నష్టాలను మిగిల్చేలానే ఉంది. దాదాపు అందరూ F2 కి టర్న్ అవ్వడంతో సినిమాకి కలెక్షన్స్ ఒక్కసారిగా డౌన్ అవుతున్నాయి. సినిమాకు రివ్యూలు పాజిటివవ్ గానే వచ్చినా ఆడియెన్స్ ఊహించిన డ్రామా చాలావరకు దర్శకుడు మిస్ చేశాడని అర్ధమవుతోంది.
ఎన్టీఆర్ బయోపిక్ కథానాయకుడు మొత్తానికి బయ్యర్స్ ని ముంచేలా కనిపిస్తోంది. యూఎస్ కూడా కూడా సినిమా నష్టాలను మిగిల్చేలానే ఉంది. దాదాపు అందరూ F2 కి టర్న్ అవ్వడంతో సినిమాకి కలెక్షన్స్ ఒక్కసారిగా డౌన్ అవుతున్నాయి. సినిమాకు రివ్యూలు పాజిటివవ్ గానే వచ్చినా ఆడియెన్స్ ఊహించిన డ్రామా చాలావరకు దర్శకుడు మిస్ చేశాడని అర్ధమవుతోంది.
అయితే కథానాయకుడు కొట్టిన దెబ్బకు మహానాయకుడులో రిస్క్ అయినా పరవాలేదని కాంట్రవర్సీలను దింపనున్నట్లు సమాచారం. సినిమాలో హీరో స్థాయి పెరగాలంటే విలన్ ని ఎంతో కొంత ఎలివేట్ చెయ్యాలి. ముందే కాంట్రవర్సీ సీన్స్ ను తీసిపెట్టుకున్న క్రిష్ వాతావరణాన్ని భట్టి యాడ్ చేయాలనీ అనుకున్నారట. కానీ ఫస్ట్ పార్ట్ కొట్టిన విధానం అర్ధమయ్యింది. ఎమోషనల్ సీన్స్ ఎంత ఇచ్చిన సరిపోదు. అందుకే ఇప్పుడు క్రిష్ ఎడిటింగ్ రూమ్ లోనే ఎక్కువగా కనబడుతున్నట్లు సమాచారం.
మరోవైపు బాలకృష్ణ కూడా సీన్స్ విషయంలో ఆలోచనలో పడ్డట్లు తెలుస్తోంది. ఫస్ట్ పార్ట్ లో నెగిటివ్ గా లేదు కాబట్టి రిలీజ్ లో ఎలాంటి ఇబ్బందులు రాలేదు. ఇక సెకండ్ పార్ట్ లో కూడా ఇలానే కొనసాగితే సినిమాకు కలెక్షన్స్ రావడం చాలా కష్టం. ఇప్పటికే బయ్యర్స్ దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. థియేటర్స్ ఖాళీగా దర్శనమిస్తున్నాయి.
మహానాయకుడులో రిస్క్ అయినా పరవాలేదని విలన్ ని ఎలివేట్ చేసేందుకు దర్శకుడు బాలకృష్ణ సిద్దమైనట్లు సమాచారం. మరోవైపు మమల్ని విలన్ గా చూపిస్తే చేయాల్సింది చేస్తామంటూ వరుస ఇంటర్వ్యూలతో వార్నింగ్ ఇచ్చేవాళ్ళు ఇస్తున్నారు. మరి సెకండ్ పార్ట్ లో దర్శకుడు ఎలాంటి ఇష్యులను చూపిస్తాడో చూడాలి. మహానాయకుడు ఫిబ్రవరి 7న రిలీజ్ కాబోతోంది.
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated Jan 14, 2019, 6:57 PM IST