Asianet News TeluguAsianet News Telugu

“గౌతమిపుత్ర శాతకర్ణి” విజయం వెనుక రాజమౌళి..అదెలా?

  • గౌతమిపుత్ర శాతకర్ణి విజయం వెనుక రాజమౌళి
  • రాజమౌళి సలహాతోనే విజయం వరించిందంటున్న క్రిష్
  • ఇంతకీ రాజమౌళి చేసిందేంటి.. చెప్పిందేంటి..
KRISH SAYS RAJAMOULI IS BEHIND HIS SUCCESS

 

సంక్రాంతి బరిలో బాక్సాఫీస్ ముందుకొచ్చి రికార్డులు బద్దలు కొట్టే దిశగా దూసుకెళ్తోంది నందమూరి బాలకృష్ణ వందో చిత్రం గౌతమి పుత్ర శాతకర్ణి. ఈ సినిమాను దర్శకుడు క్రిష్ కేవలం కొన్ని రోజుల్లో మాత్రమే పూర్తి చేసి అందర్నీ ఆశ్చర్య పరిచాడు. అయితే తన సినిమా ఇంత తక్కువ కాలంలో పూర్తి కావడం వెనుక దర్శకధీరుడు రాజమౌళి ఉన్నారని స్వయంగా క్రిష్ అంగీకరిస్తున్నారు.

క్రిష్ ఈ చిత్రం గురించి రాజమౌళికి చెప్పినప్పుడు రాజమౌళి క్రిష్ కు ఒక అద్భుతమైన సలహా ఇచ్చారు. రాజమౌళి సలహా వల్లే తాను ఈ చిత్రాన్ని కేవలం కొన్ని నెలల్లోనే షూటింగ్ పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకు రాగలిగానని స్పష్టం చేశారు. రాజమౌళి బాహుబలి చిత్రంలో తన శాతకర్ణిని పోల్చడం అవివేకం అవుతుందని క్రిష్ అంటున్నాడు. బాహుబలి ఒక ఫాంటసీ చిత్రమని ఎలాంటి కథ లేకుండా ఆ చిత్రాన్ని ఒక బాహుబలి, మాహిష్మతి అనే సామ్రాజ్యాన్ని సృష్టించి.. దాన్ని కన్నుల విందుగా ప్రేక్షకులకు అందించాడని క్రిష్ అభిప్రాయ పడుతున్నాడు.

 

మరి రాజమౌళిని అంతలా ఆదర్శంగా తీసుకున్న క్రిష్ కు జక్కన్న ఇచ్చిన సలహా ఏంటి. అదే.. రాజమౌళి క్రిష్ కు చెప్పిన సీక్రెట్. అదే... గ్రాఫిక్స్ పై ఆధారపడకుండా సినిమా ప్లాన్ చేసుకోమని చెప్పడం. రాజమౌళికి తన కథ చెప్పినప్పుడు క్రిష్ తో గ్రాఫిక్స్ పై ఆలోచించకుండా.. షూటింగ్ పక్కాగా ప్లాన్ చేసుకోమన్నాడట. అదే క్రిష్ కు ఇంతటి అద్భుత కావ్యాన్ని సునాయాసంగా తక్కువ కాలంలో తెరకెక్కించేందుకు ఉపయోగపడిందట.

రాజమౌళి గొప్పదనం గురించి క్రిష్ ఏ మాత్రం తడుముకోకుండా చెప్తున్నాడు. ఒక కొత్త పంథాను సృష్టించిన రాజమౌళి బాహుబలి సినిమాలో హీరో ప్రభాస్ తో జలపాతాల్లో కొండపైకెక్కుతూ... చెట్టుకు బాణం విసిరే సీన్ క్రియేట్ చేశాడని... అలాంటి సీన్ ఊహించడం కూడా నాకైతే కష్టమని చెప్తున్నాడు. సో.. రాజమౌళిని ఆదర్శంగా తీసుకునే తక్కువ కాలంలో షూటింగ్ పూర్తి చేశానంటున్న క్రిష్ మాటలు నమ్మొచ్చు.

Follow Us:
Download App:
  • android
  • ios