బయోపిక్ అనే పదానికి ఇప్పుడు ఎన్టీఆర్ తో సరికొత్త అర్ధాన్ని చెప్పాలని బాలకృష్ణ టీమ్ పడుతున్న కష్టం అంతా ఇంతా కాదు. ఎన్టీఆర్ తెలుగు జాతి గర్వించేలా సినిమాలు తీశారు. అందులో ఎలాంటి అనుమానం లేదు. అయితే ప్రతి మనిషిలో ఎదో ఒక బ్లాక్ షెడ్ ఉంటుంది. మహానటిలో సావిత్రి నెగిటివ్ షెడ్ ను కూడా టచ్ చేశారు. 

కథానాయకుడు విషయంలో ఎన్టీఆర్ కు సంబందించిన జీవితాన్ని చూపించకుండా ఆయన విజయాల్ని మాత్రమే ఎక్కువ చూపించారు. భజన డోస్ ఎక్కువవడంతో క్రిష్ మేకింగ్ పై జనాలు అంతగా ఆసక్తి చూపులకపోయారు. దాదాపు చాలా వరకు బయ్యర్స్ కోలుకోలేని పరిస్థితి. కలెక్షన్స్ డల్ అవుతున్నాయి. ఎన్టీఆర్ ను ఎలా చూపించిన జనాలు నమ్మేస్తారనుకున్నారో ఏమో పాపం.. మహానటికి వచ్చిన రెస్పాన్స్ లో కొంచెం కూడా రావడం లేదు.  

ఇక ఇప్పుడు మహానాయకుడిపై బాలకృష్ణ పెట్టుకున్న నమ్మకం అంతా ఇంతా కాదు. ఆ సినిమా కూడా తప్పకుండా బాక్స్ ఆఫీస్ హిట్ గా నిలుస్తుందని మురిసిపోతున్నారు. ఆ సినిమా అయితే అసలు ఉన్నదీ ఉన్నట్లు కూడా ఉండే ఛాన్స్ అయితే లేదని సొంతంగా డబ్బా కొట్టుకునేల అంటుందని కామెంట్స్ వినిపిస్తున్నాయి. చంద్రబాబు పై పాజిటివ్ రెస్పాన్స్ వచ్చేలా అప్పటి పరిస్థితుల వల్ల మాత్రమే అలా జరిగినట్లు చూపించి నేరం కాలం మీద వేస్తే సరిపోతుందని ఎన్టీఆర్ టీమ్ ప్రయత్నాలు చేస్తున్నట్లు అర్ధమవుతోంది. 

సినిమాకి ఎంత పాజిటివ్ రివ్యూలు వచ్చినా మహానాయకుడు లో జనాలు కోరుకునే పాయింట్ మిస్ అయితే మొదటికే మోసం వస్తుంది. బాలకృష్ణపై సోషల్ మీడియాలో ఎలాగో సెటైర్లు పడుతున్నాయి. ఇక దర్శకుడు క్రిష్ నటీనటులు వారి కెరీర్ లో ఎంతవరకు పాజిటివ్ టాక్ ను అందుకుంటారో చూడాలి. ఇక మహానాయకుడు సినిమా ఫిబ్రవరి 7న రిలీజ్ కాబోతోంది.