ఎన్టీఆర్ బయోపిక్ తో దర్శకుడు క్రిష్ కోలుకోలేని దెబ్బ తిన్నాడు. అంతకంటే ముంద మణికర్ణికను తెరకెక్కించి చివరలో తప్పుకున్న క్రిష్ ఊహించని షాక్ లను ఎదుర్కొన్నాడు.
ఎన్టీఆర్ బయోపిక్ తో దర్శకుడు క్రిష్ కోలుకోలేని దెబ్బ తిన్నాడు. అంతకంటే ముంద మణికర్ణికను తెరకెక్కించి చివరలో తప్పుకున్న క్రిష్ ఊహించని షాక్ లను ఎదుర్కొన్నాడు. గతంలో సైలెంట్ గా సినిమాలు చేసుకుంటూ మినిమమ్ హిట్స్ అందుకునే క్రిష్ ఈ ఏడాది మాత్రం తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొక తప్పలేదు.
క్రిష్ కు బాలీవుడ్ లో మంచి పేరుంది. ఠాగూర్ న్నీ అక్కడ గబ్బర్ ఈజ్ బ్యాక్ పేరుతో రీమేక్ చేశాడు. అక్షయ్ కుమార్ కథానాయకుడిగా నటించిన ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టింది. అయితే ఇప్పుడు మళ్ళీ అక్షయ్ కుమార్ తో ఒక సినిమా చేయాలనీ క్రిష్ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే అక్షయ్ కి ఒక స్క్రిప్ట్ ను వినిపించిన క్రిష్ పాజిటివ్ రెస్పాన్స్ ను అందుకున్నట్లు తెలుస్తోంది. స్క్రీన్ ప్లే విషయంలో కొన్ని డౌట్ లు అడిగినప్పటికీ అక్షయ్ నెక్స్ట్ క్రిష్ తో చేయాలనీ అనుకుంటున్నాడట. త్వరలోనే క్రిష్ అక్షయ్ తో సినిమాను మొదలుపెట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం.
