బ్రో ఈవెంట్ లో కనిపించని క్రిష్, హరీష్ శంకర్, వారి సినిమాలు ఇక అనుమానమేనా..?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. సాయి ధరమ్ తేజ్ బ్రో మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్ లో తారలు తళ్ళుక్కున మెరిశారు. అయితే పవర్ స్టార్ తో సినిమాలు చేస్తున్న డైరెక్టర్లు క్రిష్ కాని.. హరీష్ శంకర్ కాని కనిపించలేదు. దాంతో రకరకాల ఊహాగానాలు ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతున్నాయి.

సాధారణంగా స్టార్ హీరోల సినిమాలకు సంబంధించిన సినిమాలు ఓ రెండు మూడు సెట్స్ లో ఉన్నాయి అంటే.. వాటిలో ఏ మూవీకి సబంధించిన ఈవెంట్ అయినా సరే.. ఆమూడు సినిమా దర్శకులు వస్తుంటారు.. మాట్లాడుతారు.. సాంగో.. టీజరో రిలీజ్ చేస్తారు..మరీ ముఖ్యంగా మెగా ఫ్యామిలీ సినిమా ఈవెంట్స్.. అందులోను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల ఈవెంట్లకు.. ఆయన ఇతర సినిమాల దర్శకులు రావడం కామన్.. పక్కాగా వచ్చి తీరుతారు.. ఈవెంట్ లో సందడి చేస్తారు. కాని ఈసారి మాత్రం బ్రో ప్రీరిలీజ్ ఈవెంట్ లో చిత్రమైన సంఘటన జరిగింది. ఈసారి ఈవెంట్ కు పవర్ స్టార్ దర్శకులు క్రిష్, హరీష్ శంకర్ లు రాలేదు మరి.
నిజానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దాదాపు మూడేళ్ళకు పైనే అవుతుంది క్రిష్ తో హరీ హరవీరమల్లు, హరీష్ శంకర్ తో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు కమిట్ అయ్యి.. కాని వాటిని కంప్లీట్ చేయడానికి పవర్ స్టార్ కు టైమ్ దొరకడంలేదు. పొలిటికల్ గా బిజీ అవ్వడం.. ఒకేసారి నాలుగైదు సినిమాలు సెట్స ఎక్కించడం.. టైట్ షెడ్యుల్స్ కారణంగా.. ఈ రెండు సినిమాలు న్యాయం చేయలేకపోతున్నారు పవన్ కళ్యాణ్. సరిగ్గా ఇదే టైమ్ లో.. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న క్రిష్, హరీష్ లను వదిలేసి బ్రో సినిమా కోసం టైమ్ ఇచ్చాడు పవర్ స్టార్. సినిమాను కంప్లీట్ చేశాడు కూడా. దాంతో ఏం జరుగుతుందో అర్ధం కాలేదు పవర్ స్టార ఫ్యాన్స్ కు.
హరీష్ శంకర్ కు కాస్త టైమ్ అన్నా ఇచ్చి.. కొంత లో కొంత షూటింగ్ కంప్లీట్ చేశాడు పవర్ స్టార్.. కాని హరిహరవీరమల్లు మాత్రం చాలా కాలంగా అలా పెండింగ్ పడిపోతూనే ఉంది. ఈసినిమా కోసం వేసినసెట్స్ కూడా పాడైపోయాయని న్యూస్ వైరల్ అయ్యింది. అంతే కాదు ఈ సినిమా విషయంలో క్రిష్ కు.. పవర్ స్టార్ కు ఎక్కడో ఢిఫరెన్సెస్ వచ్చాయి అన్న మాట కూడా వినిపించింది. ఇంత జరుగుతున్న వేళ.. బ్రో రిలీజ్ ఈవెంట్ లో ఈ ఇద్దరు డైరెక్టర్లు కనిపించకపోవడం అందరికి అనుమానాలు రేకెత్తిస్తోంది.
అయితే పవర్ స్టార్ ఈవెంట్ కు పక్కాగా వచ్చే వాళ్లు.. రాకపోవడంతో... ఈరెండుసినిమాల గురించి అప్ డేట్ ఇవ్వాల్సి వస్తుంది అన్న కారణంగా ఈవెంట్ కు రాలేదేమో అని కొంతమంది అనుకుంటున్నారు. లేదు ఏదో తేడా వచ్చిందనుకుంటున్నారు మరికొంత మంది. ఈక్రమంలో ఈ రెండు సినిమాల పరిస్థితి ఏంటీ అనేది తేలాల్సి ఉంది. అయితే ఇక్కడ క్రిష్ రాకపోయినా.. హరిహరవీరమల్లు నిర్మాత ఏఎం రత్నం మాత్రం ఈవెంట్ లో సందడి చేశారు. పవర్ ఫుల్ స్పీచ్ కూడా ఇచ్చారు. దాంతో.. క్రిష్ తోనే పవన్ కు ప్రాబ్లమ్ ఉందా అంటూ గుసగుసలాడుకుంటున్నారు జనాలు. మరి ఈరెండుసినిమాల పరిస్థితి ఏంటీ అనేది ముందు ముందు తెలిసే అవకాశం ఉంది.