మాస్‌మహారాజ్‌ రవితేజ, డైరెక్టర్‌ గోపీచంద్‌ మలినేని కాంబినేషన్‌లో వచ్చిన ‘క్రాక్‌’ ఘన విజయం సాధించింది. ఈ సినిమా జనవరి 9న సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. శృతిహాసన్‌ హీరోయిన్ గా చేసిన ఈ సినిమాకు మార్నింగ్ షో నుంచే హిట్ టాక్ వచ్చజింది. రవితేజ ఎనర్జిటిక్ పెర్ఫామెన్స్.. శ్రుతిహాసన్ గ్లామర్ రొమాంటిక్ సాంగ్స్ అన్నీ మాస్ కి బాగా కనెక్టయ్యాయని కలెక్షన్స్ చెప్తున్నాయి.  రీసెంట్ గా చిత్ర టీమ్ విశాఖపట్నంలో విజయోత్సవ సభ కూడా చేసింది.

 కరోనా లాక్ డౌన్ తర్వాత విడుదలై  సెన్సేషన్ హిట్ సాధించిన తొలి తెలుగు సినిమా ఇదే. క్రాక్ కలక్షన్ల పరంగా దూసుకుపోతుంది. ఈ సినిమా ఫస్ట్ వీక్ రికార్డ్ కలెక్షన్లను సొంతం చేసుకుంది. ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు తెలుగు రాష్ట్రాల్లో 21. 50 కోట్లు షేర్ వసూలు చేసింది. గ్రాస్ దాదాపు 38 కోట్ల వరకు ఉంది. దాంతో  ఇప్పుడు క్రాక్ కి థియేటర్ల సంఖ్య పెంచాలని కూడా నిర్మాతలు భావిస్తున్నారని సమాచారం.

ఈ మద్యకాలంలో ‘రాజా ది గ్రేట్’ మినహాయిస్తే హిట్టే రాలేదు రవితేజ నుంచి. అంతకు ముందు, తర్వాత అన్నీ ఫ్లాపులు, డిజాస్టర్లే. చివరగా అయితే టచ్ చేసి చూడు, అమర్ అక్బర్ ఆంటోనీ, డిస్కో రాజా సినిమాలు రవితేజకు తీవ్ర నిరాశను మిగిల్చాయి.ఈ నేపథ్యంలో రవితేజ, ఆయన ఫ్యాన్స్ ఆశలన్నీ ‘క్రాక్’ మీదే నిలిచాయి. వాటిని ఈ సినిమా నిలబెట్టింది.  50 శాతం ఆక్యుపెన్సీతోనే ఈ స్దాయిలో ఉంటే వంద శాతం ఆక్యుపెన్సీతో రిలీజైతే ఇంక కలెక్షన్స్  గురించి చెప్పేదేముంది.