ఆహాకి `క్రాక్‌` నిర్మాత న‌ష్ట‌ప‌రిహారం?

సంక్రాంతికు ఓ నాలుగు రోజులు ముందే బరిలో దిగిన చిత్రం మాస్ మహరాజా రవితేజ . ఈ మూవీ మిగతా సంక్రాంతి సినిమాలు కన్నా హిట్ టాక్ తెచ్చుకుని కలెక్షన్స్ లో ఫస్ట్ ప్లేస్ లో లో నిలిచింది. మాస్ మసాలా ఎంటర్ టైనర్ గా డైరక్టర్ మలినేని గోపీచంద్ దీనిని తెరకెక్కించిన విధానం జనాలకు బాగా ఎక్కింది.కరోనా తో  యాభై శాతం ఆక్యుపెన్సీతో కూడా 'క్రాక్' చక్కని కలెక్షన్లను రాబడుతోంది. అయితే... ఈ సినిమా విడుదలకు ముందే జనవరి 29న 'ఆహా'లో ఈ చిత్రాన్ని స్ట్రీమింగ్ జరిపేందుకు అగ్రిమెంట్ చేసుకున్నారు నిర్మాతలు. దాంతో కలెక్షన్స్ కు గండిపడే అవకాసం ఉంది. 

Krack producers  Compensation to Aha OTT jsp

 అయితే... ఈ సినిమా విడుదలకు ముందే జనవరి 29న 'ఆహా'లో ఈ చిత్రాన్ని స్ట్రీమింగ్ జరిపేందుకు అగ్రిమెంట్ చేసుకున్నారు నిర్మాతలు. దాంతో కలెక్షన్స్ కు గండిపడే అవకాసం ఉంది. నిర్మాతలు పునరాలోచనలో పడ్డారు. ఓటీటీ ప్లాట్ ఫామ్ 'ఆహా'లో స్ట్రీమింగ్ అయితే... ఖచ్చితంగా థియోటర్స్ లో ఊపు తగ్గుతుంది. అది కలెక్షన్ల మీద కూడా ప్రభావం చూపుతుంది. దాంతో ఆహా యాజమాన్యానికి రవితేజ సలహాతో నిర్మాతలు ఈ విషయం  తెలిపారు. దాంతో ఆ సంస్థ సైతం సానుకూలంగా స్పందించింది. 

'చిత్రసీమలో భాగమైన తాము అన్ని రకాలుగా సినిమా ను నిలబెట్టడం కోసం ప్రయత్నిస్తామని, అందుకే జనవరి 29న స్ట్రీమింగ్ జరపాల్సిన 'క్రాక్'ను ఫిబ్రవరి 5వ తేదీకి వాయిదా వేశామ'ని సోషల్ మీడియా ద్వారా తెలిపింది. 

అయితే ఆ మేర‌కు ఆహా సంస్దకి నష్ట‌ప‌రిహారం చెల్లించ‌డానికి మ‌ధు రెడీ అయ్యారని ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం‌. దాదాపు 40 ల‌క్ష‌ల వ‌ర‌కూ.. సొమ్ము వాప‌న్ చేయ‌నున్నార‌ని స‌మాచారం. అందుకే ఆహా సంస్ద వారు కూడా ఒప్పుకున్నారని తెలుస్తోంది.
   
ఇక క్రాక్ సినిమాని 8.25 కోట్లు ఖర్చు పెట్టి ఆహా వారు రైట్స్ సొంతం చేసుకున్నట్లు సమాచారం. అమేజాన్ ప్రైమ్ వారు సైతం ఈ సినిమా రైట్స్ కోసం భారీగా ఖర్చుపెట్టడానికి రెడీ అయ్యారు. అయితే ఆహా కు చెందిన అల్లు అరవింద్ దూకుడుగా ముందుకువెళ్లి  సొంతం చేసుకున్నట్లుగా ఈ రేటుకు ఫైనల్ చేసుకున్నారు. ఆహాలో రిలీజు అవుతున్న మొదటి పెద్ద సినిమా ఇదే కావటం విశేషం.

డాన్‌శీను, బ‌లుపు వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్స్ త‌ర్వాత మాస్ మ‌హారాజా ర‌వితేజ‌, గోపిచంద్ మ‌లినేని కాంబినేష‌న్‌లో రూపొందిన హ్యాట్రిక్ చిత్రం `క్రాక్`. శృతిహాస‌న్ హీరోయిన్‌గా న‌టించ‌గా స‌ముద్ర‌ఖ‌ని, వ‌ర‌ల‌క్ష్మిశ‌ర‌త్‌కుమార్ కీల‌క పాత్ర‌ల‌లో న‌టించారు. ‌స‌ర‌స్వ‌తి ఫిలిం డివిజ‌న్ ప‌తాకంపై బి. మ‌ధు నిర్మించారు.  

డైరక్టర్ గోపిచంద్ మలినేని మాట్లాడుతూ... ‘‘తెలుగు ప్రేక్షకులు మంచి సినిమాకోసం ఎదురు చూశారు. సరైన సమయానికి సరైన సినిమాగా ‘క్రాక్‌’ వచ్చింది. ఈ చిత్రంతో ఇప్పటిదాకా ఉన్న గందరగోళాలన్నీ ఒక్కసారిగా తొలగిపోయి... పరిశ్రమకి మళ్లీ ఊపొచ్చింది’’ అన్నారు గోపీచంద్‌ మలినేని. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios