ఈ సంక్రాంతికి విడుద‌ల అవుతున్న సినిమాల్లో `క్రాక్‌` ఒక‌టి. రేపు అంటే జ‌న‌వ‌రి 9నే ఈ సినిమా వ‌స్తోంది. సంక్రాంతి తొలి కోడి పుంజు ర‌వితేజ‌దే కావటంతో అందరీ దృష్టీ ఈ సినిమాపై ఉంది. గోపీచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. శ్రుతిహాస‌న్ హీరోయిన్‌. రీసెంట్ గా విడుద‌లైన ట్రైల‌ర్ దుమ్ము రేపింది. ఈ నేపధ్యంలో  ఈ సంక్రాంతికి ఫుల్ మాస్ మీల్స్ పెడుతుందా..పెడితే ఎంత కలెక్షన్స్ రావచ్చు. ఎంతొస్తే బ‌య్య‌ర్లు సేఫ్ అయిపోతారు. ఎంత పెట్టుబడి పెట్టారు..ఎంత బిజినెస్ జరిగింది వంటి విషయాలపై డిస్కషన్ ట్రేడ్ సర్కిల్స్ లో మొదలైంది.

అందుతున్న సమాచారం మేరకు ..ఈ సినిమాకు రవితేజ రెమ్యూనిరేషన్ కాకుండా 30 కోట్లకు పైగా ఖర్చయిందని మీడియాలో వార్తలు వస్తున్నాయి.  అలాగే బిజినెస్ వైజ్ ...ఆంధ్ర ఏరియా 8 కోట్లు, నైజాం 6.30 కోట్లు, సీడెడ్ 2.70 కోట్లకు థియేటర్ హక్కులు ఇచ్చారు. అంటే రూ.17 కోట్లు రాబ‌డితే చాలు. బ‌య్య‌ర్లు సేఫ్ అయిపోతారు. సంక్రాంతి సీజ‌న్ కాబ‌ట్టి... 17 కోట్లు తెచ్చుకోవ‌డం ఈజీనే అంటున్నారు.
 ఇక నాన్ థియేటర్ హక్కుల్లో హిందీ డబ్బింగ్ 11 కోట్లు, డిజిటల్ 7 కోట్లు (ఆహా), శాటిలైట్ 6 కోట్లు (మా) రైట్స్ నిమిత్తం వచ్చాయి. ఇక్కడితో నిర్మాత ఫుల్ గా సేఫ్. నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రవితేజ మాస్‌ యాక్షన్‌ అవతారంలో కనిపించనున్నాడు.   

ర‌వితేజ‌, శ్రుతి హాస‌న్‌, స‌ముద్ర‌క‌ని, వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్‌కుమార్‌, దేవీప్ర‌సాద్‌, చిర‌గ్ జాని, మౌర్య‌ని, సుధాక‌ర్ కొమాకుల‌, వంశీ చాగంటి తదితరులు.

సాంకేతిక బృందం:
క‌థ‌, స్క్రీన్‌ప్లే, ద‌ర్శ‌క‌త్వం: గోపీచంద్ మ‌లినేని
నిర్మాత‌: బి. మ‌ధు
బ్యాన‌ర్‌: స‌ర‌స్వ‌తి ఫిలిమ్స్ డివిజ‌న్‌
సంగీతం: ఎస్‌. త‌మ‌న్‌
సినిమాటోగ్ర‌ఫీ: జి.కె. విష్ణు
డైలాగ్స్‌: సాయిమాధ‌వ్ బుర్రా
స‌హ నిర్మాత‌: అమ్మిరాజు కానుమిల్లి
కూర్పు: న‌వీన్ నూలి
ఆర్ట్‌: ఎ.ఎస్‌. ప్ర‌కాష్‌
ఫైట్స్‌: రామ్‌-ల‌క్ష్మ‌ణ్‌
పాట‌లు: రామ‌జోగ‌య్య శాస్త్రి