బాహుబలి రచయిత విజయేంద్ర ప్రసాద్ వద్ద పని చేసిన కొవెర స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'యు'. హీరోగా నటిస్తూ కోవెర తెరకెక్కించిన ఈ సినిమా డిసెంబర్ 14న రిలీజ్ కాబోతోంది. ఈ సందర్బంగా కోవెర చెప్పిన విషయాలు హాట్ టాపిక్ అయ్యాయి.

కోవెర మాట్లాడుతూ.. ఈ సినిమాకు కథే అసలైన హీరో. విజయేంద్ర ప్రసాద్ గారి వద్ద నాలుగేళ్లు పనిచేశాను. నాకున్న కథ మీద అనుభవం ఈ కథను మరింత బలపరిచింది. అసలైతే సినిమాను పవన్ కళ్యాణ్ గారి కోసం స్పెషల్ గా రాసుకున్నాను. 100 కోట్లతో తీయాల్సిన సినిమా. కానీ మా దగ్గర అంత బడ్జెట్ లేకపోవడంతో కోటి రూపాయలతో చేసినట్లు దర్శకుడు కోవెర వివరణ ఇచ్చారు. 

ప‌ల్లెటూరిలో మొద‌లై అండర్ వ‌ర‌ల్డ్ లో ఎండ్ అయ్యే ఈ కథ 80  ఏళ్ల సినిమా చ‌రిత్ర‌లో ఎవ‌రూ ట‌చ్ చేయ‌ని ప్రాజెక్ట్ అని చిత్ర యూనిట్ చెబుతోంది. ఇక  సినిమాలో హిమాన్షి కాట్ర‌గ‌డ్డ, స్వప్నా రావ్ కథానాయికలుగా నటించారు. అయితే డిఫరెంట్ సినిమా అంటూ హైప్ క్రియేట్ చేస్తోన్న 'యు' చిత్ర యూనిట్ ఎంతవరకు మెప్పిస్తుందో చూడాలి.