కోలీవుడ్ సినిమా కణా కు రీమేక్ గా వస్తోన్న స్పోర్ట్స్ డ్రామా ఫిల్మ్ కౌసల్య కృష్ణమూర్తి ది క్రికెటర్. పరభాషా కథలను పర్ఫెక్ట్ గా తెలుగులో ప్రజెంట్ చేసే భిమానేని శ్రీనివాసరావు ఈ సందేశాత్మక కథకు దర్శకత్వం వహించాడు. కె ఏ వల్లభ సినిమాను నిర్మిస్తున్నారు. ఇకపోతే ఆగస్ట్ 23న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానున్న ఈ సినిమా ట్రైలర్ విడుదల చేశారు. 

ఒక సాధారణ గ్రామీణ యువతి నేషనల్ లెవెల్లో వుమెన్ క్రికెటర్ గా ఎలా ఎదిగింది అనేది సినిమాలో అసలు పాయింట్.  ఐశ్వర్య రాజేష్ - శివ కార్తికేయన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాలో డైలాగ్స్ తోనే ఎక్కువగా ఎట్రాక్ట్ చేస్తోంది. గవాస్కర్ సచిన్ లాంటి వాళ్ళు కొడుకులను క్రికెట్ లోకి పంపారు గాని కూతుళ్లను పంపారా? అని వచ్చే హార్ట్ బ్రేకింగ్ డైలాగ్స్ తో పాటు తండ్రి ఆశయాన్ని ఒడిసి పెట్టుకునేలా ఓ అమ్మాయి పడిన కష్టం సినిమాలో ఉన్నట్లు అర్ధమవుతోంది. 

ఈ లోకం గెలుస్తానని చెబితే వినదు. కానీ గెలిచినవాళ్లు చెబితే వింటుంది. నువ్ ఎమ్ చెప్పినా గెలిచి చెప్పు అని చివరలో వచ్చిన డైలాగ్ సినిమా స్థాయిని పెంచింది. మరి సినిమా బిగ్ స్క్రీన్ పై ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి.