వెండి తెరపై క్రికెట్ నేపథ్యం ఉన్న చిత్రాలు ఎక్కువవుతున్నాయి. ఇండియాలో క్రికెట్ కు ఉన్న ఆదరణ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక్కడ క్రికెట్ అనేది ఒక మతంలా మారిపోయింది. కానీ పురుషుల క్రికెట్ కు ఉన్నంత ఆదరణ మహిళా క్రికెట్ కు లేదు. తాజాగా 'కౌశల్య కృష్ణమూర్తి చిత్ర టీజర్ విడుదలయింది. క్రికెట్ నేపథ్యంలో తెరకెక్కుతున్న చిత్రం ఇది. 

తమిళంలో ఘనవిజయం సాధించిన కణ చిత్రానికి ఇది రీమేక్. పల్లెటూరిలో రైతుల కష్టాలని, పేదింటి యువతిగా క్రికెటర్ కావాలనుకునే అమ్మాయి కథని ముడిపెడుతూ ఈ చిత్రాన్ని రూపిందించారు. భీమినేని శ్రీనివాసరావు ఈ చిత్రానికి దర్శకుడు. క్రికెటర్ కావాలనుకునే యువతిగా ప్రధాన పాత్రలో ఐశ్వర్య రాజేష్ నటిస్తోంది. 

రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. తమిళ స్టార్ హీరో శివకార్తికేయన్ కూడా ఈ చిత్రంలో నటిస్తున్నాడు. కౌశల్య కృష్ణమూర్తి టీజర్ ఎమోషన్ తో కట్టిపడేసే విధంగా ఉంది. పల్లెటూరిలో రైతులు ఎదుర్కొనే కష్టాలు, క్రికెటర్ కావాలనుకునే యువతి శ్రమని ప్యార్లల్ గా చూపించబోతున్నారు. 

'క్రికెట్ చాలా కష్టమైన ఆట.. నీలాంటి సున్నితమైన ఆడపిల్లలు ఆడలేరు' అనే డైలాగ్ టీజర్ లో ఆకట్టుకుంటోంది. ఐశ్యర్యారాజేష్ పల్లెటూరి యువతిగా సహజసిద్ధంగా కనిపించింది. మొత్తంగా కౌసల్య కృష్ణమూర్తి టీజర్ సినిమాపై ఆసక్తిని పెంచే విధంగా ఉంది అని చెప్పడంలో సందేహం లేదు. మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా ఈ టీజర్ లాంచ్ అయింది.