పవన్ కళ్యాణ్ గారిని రోడ్ షో చేయకుండా ఆపడం,చంద్రబాబు గారిని అరెస్ట్ చేయడం, జగన్ గారిని ఎయిర్ పోర్ట్ లో ఆపడం, ఇలాంటి సినారియోను
రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ లీడ్ రోల్స్‌లో తేజ మార్ని తెరకెక్కించిన చిత్రం ‘కోట బొమ్మాళి పీఎస్’. శ్రీకాంత్, వరలక్ష్మీ శరత్ కుమార్ కీలకపాత్రలు పోషించారు. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్‌పై బన్నీ వాస్, విద్యా కొప్పినీడి నిర్మించారు. నవంబర్ 24న సినిమా విడుదలవుతోంది. ఈ సినిమా జనసేనకు, పవన్ కళ్యాణ్ సిద్దాంతాలకు సపోర్ట్ గా తీసిన సినిమా అంటూ ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అందులోనూ నిర్మాత బన్నీవాస్ కావటం, ఆయన పవన్ కళ్యాణ్ కి వీరాభిమాని కావటంతో ఆ సిద్దాంతాలను టచ్ చేస్తూ ప్రస్తుత ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొన్ని సన్నిశాలు డిజైన్ చేసినట్లు చెప్పుకుంటున్నారు.
అయితే సినిమా టీమ్ మాత్రం వీటిని కొట్టిపారేస్తోంది. ఇందులో పొలిటికల్ ఎలిమెంట్స్ ఉన్నప్పటికీ ఎవరిపై సెటైర్ గా ఉండదని, ఏ పార్టీ వాయిస్ వినిపించదని అంటున్నారు. పొలిటిషన్స్ పోలీసులను ఎలా వాడుకుంటారు? దానివల్ల పోలీసులకు ఎదురైన ఇబ్బందులు ఏమిటి అనేది మెయిన్ కాన్సెప్ట్. ఓటు బ్యాంకింగ్ కోసం కులాలను మతాలను రాజకీయ నాయకులు ఏ విధంగా వాడుకుంటారు అనేది ఇందులో స్పష్టంగా చూపించారు. సిస్టమ్ లో జరిగేది మాత్రమే చూపించారు.. కానీ పొలిటికల్ గా ఎలాంటి సెటైర్ ఉండదు అని చెప్పుకొచ్చారు.
దర్శకుడు మాట్లాడుతూ... ఈ సినిమా కథ విషయానికి వస్తే.. పోలీసు చేజింగ్ పోలీసు. ప్రస్తుతం పోలీసులు ఎలా నలిగిపోతున్నారో మేము చూపించాలని అనుకున్నాం. ఒక పొలిటీషియన్ చేతుల్లో పోలీసులు ఎలా కీలుబొమ్మల్లా తయారవుతారు అనేది మేము టచ్ చేశాం. ఉదాహరణకు పవన్ కళ్యాణ్ గారిని రోడ్ షో చేయకుండా ఆపడం, జగన్ గారిని ఎయిర్ పోర్ట్ లో ఆపడం, చంద్రబాబు గారిని అరెస్ట్ చేయడం ఇలాంటి సినారియోను చూసి కథ రాసుకున్న ఇది అన్నారు.