మెగాస్టార్ చిరంజీవి గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు వెల్లడించారు డైరెక్టర్ కొరటాల శివ. సెట్ అంటే ఆయనకు ఎంతో ఇష్టమో చెపుతూ..ఎవరికీ తెలియని కొన్ని విషయాలను పంచుకున్నారు స్టార్ డైరెక్టర్.
మెగాస్టార్ చిరంజీవి గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు వెల్లడించారు డైరెక్టర్ కొరటాల శివ. సెట్ అంటే ఆయనకు ఎంతో ఇష్టమో చెపుతూ..ఎవరికీ తెలియని కొన్ని విషయాలను పంచుకున్నారు స్టార్ డైరెక్టర్.
ఫెయిల్యూర్ అంటూ ఎరుగని దర్శకుడిగా టాలీవుడ్ లో పేరు సంపాధించుకున్నారు కొరటాల శివ. ఇక ఆయన తాజాగా తెరకెక్కించిన సినిమా ఆచార్య. మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ స్క్రీన్ శేర్ చేసుకున్న ఈమూవీ ఈ నెల 29వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లను పలకరించబోతోంది. లాంగ్ గ్యాప్ తరువాత మెగాస్టార్ నుంచి వస్తున్న సినిమా కావడంతో ఫ్యాన్స్ ఈమూవీ గురించి ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.
రిలీజ్ దగ్గర పడుతుండటంతో ఆచార్య ప్రమోషన్స్ ను స్పీడ్ అప్ చేశారు టీమ్. ఇక ఈ ప్రనమోషన్ లో భాగంగా కొరటాల శివ ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు. కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు వెల్లడించారు. ముఖ్యంగా మెగాస్టార్ గురించి కొన్ని విషయాలు పంచున్నారు కొరటాల శివ. చిరంజీవి సెట్ లో ఎలా ఉంటారు. ఏం చేస్తారు లాంటి విషయాలు మాట్లాడారు
కొరటాల మాట్లాడుతూ.. చిరంజీవిగారికి సెట్ అంటే ఇష్టం. ఆయన సీనియర్ ఆర్టిస్ట్ గనుక, ఆయనకి ఈవినింగ్ 4.40కి పేకప్ చెప్పేవాడిని. మిగతా వాళ్లందరినీ 6.40కి పంపించేవాడిని కానీ చిరంజీవిగారు అక్కడి నుంచి వెళ్లేవారు కాదు. అలా టీ తాగుతూ అక్కడే కూర్చునేవారు. అందరికీ పేకప్ చెప్పిన తరువాతనే ఆయన వెళ్లేవారు. అది మెగాస్టార్ అంటే. సెట్ ను ఆయన అంత గౌరవిస్తారు. తోటి యాక్టర్స్ ను కూడా గౌరవంగా చూస్తారన్నారు.
సెట్ అంటే చిరంజీవిగారికి ఎంతో ఇష్టం. లైట్స్, సౌండ్ ,యాక్షన్ .. కట్ అనేవి ఆయనకి ఎంతో ఇష్టమైన పదాలు అన్నారు కొరటాల. . సెట్ కి ఎవరైనా వస్తానంటే వాళ్ల కోసం ఎంతో ఓపికగా వెయిట్ చేసేవారు. వాళ్లతో సరదాగా కబుర్లు చెబుతూ ఉండేవారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన ఇంటి దగ్గర కన్నా సెట్లో ఉండటానికే ఎక్కువగా ఇష్టపడుతుంటారు అని చెప్పుకొచ్చారు కొరటాల శివ.
