మెగాస్టార్ కోసం కొరటాల స్క్రిప్ట్.. స్పెషలిటీ అదే!

https://static.asianetnews.com/images/authors/74ce1d03-f84b-5b8e-abc1-c43c5f7c8632.jpg
First Published 14, Sep 2018, 6:30 PM IST
koratala siva preparing script for megastar
Highlights

దర్శకుడు కొరటాల శివ ఇప్పటివరకు డైరెక్ట్ చేసిన ప్రతి సినిమా బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అందుకున్నదే. దర్శకుడిగా ప్రేక్షకుల్లో ఆయనకి మంచి క్రేజ్ ఉంది.

దర్శకుడు కొరటాల శివ ఇప్పటివరకు డైరెక్ట్ చేసిన ప్రతి సినిమా బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అందుకున్నదే. దర్శకుడిగా ప్రేక్షకుల్లో ఆయనకి మంచి క్రేజ్ ఉంది. ఇటీవల 'భరత్ అనే నేను' చిత్రంతో సక్సెస్ అందుకున్న కొరటాల ప్రస్తుతం తన తదుపరి సినిమా కోసం సిద్ధమవుతున్నాడు.

'సై రా' సినిమా తరువాత కొరటాల.. మెగాస్టార్ చిరంజీవిని డైరెక్ట్ చేయబోతున్నారు. ఈ జెనరేషన్ టాప్ హీరోలకు తమ కెరీర్ లో బెస్ట్ ఫిలిమ్స్ అందించిన కొరటాల ఇప్ప్పుడు చిరు కోసం కథను సిద్ధం చేస్తున్నాడు. అయితే కథా పరంగా ఎలాంటి లూప్ హోల్స్ లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.

కొరటాల స్టైల్ లో కథ నడుస్తూనే అంతర్లీనంగా ఓ సందేశం కూడా ఉంటుందని సమాచారం. చిరంజీవి నుండి ప్రేక్షకులు ఆశించి మాస్ ఎలిమినేట్స్ అన్నీ ఈ కథలో ఉండేలా చూసుకుంటున్నాడు. చిరు మేనరిజమ్స్ తెరపై మరింత ఆకట్టుకునే విధంగా ప్రతి చిన్న డీటైల్ విషయంలో కేర్ తీసుకుంటున్నాడట.

వచ్చే ఏడాది సంక్రాంతి నాడు ఈ సినిమా ప్రారంభోత్సవ వేడుక జరపనున్నారు. 'సై రా' షూటింగ్ ఓ కొలిక్కి వచ్చిన తరువాత కొరటాల సినిమా షూటింగ్ మొదలుకానుంది.  

loader