మెగాస్టార్ చిరంజీవి మొత్తానికి సైరా పనులను ముగించేశారు. సినిమా రిలీజ్ పనుల్లో ప్రస్తుతం బిజీగా ఉంది. ఇక మెగాస్టార్ చేయాల్సిందల్లా సైరా ప్రమోషన్స్ లో పాల్గొనడమే. అక్టోబర్ 2న సైరా సినిమా రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా రిలీజ్ అనంతరం మెగాస్టార్ కొరటాల ప్రాజెక్ట్ కోసం రెడీ కానున్నారు. 

దర్శకుడు కొరటాల ఇప్పటికే బౌండ్ స్క్రిప్ట్ తో రెడీగా ఉన్నాడు. ఇక చిరు కూడా సినిమాలో సరికొత్తగా కనిపించేందుకు వర్కౌట్స్ చేస్తున్నాడు. మెయిన్ గా ఫెస్ లుక్ పై జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సమాచారం. కొరటాల మెగాస్టార్ ని రెండు డిఫరెంట్ షేడ్స్ లలో చూపించనున్నాడట. ఒక పాత్ర కోసం ముంబైకి చెందిన కాస్యూమ్ డిజైనర్ తో కలిసి చిరు కొత్త లుక్ కోసం దర్శకుడు హోమ్ వర్క్ చేస్తున్నట్లు తెలుస్తోంది.  

వీలైనంత త్వరగా సినిమాకు సంబందించిన ఫస్ట్ లుక్ ని మెగా అభిమానులకు అందించాలని దర్శకుడు వర్క్ చేస్తున్నాడు. మ్యాటీ ఎంటర్‌టైన్‌మెంట్స్, కొణిదెల ప్రొడక్షన్స్‌ కలిసి మెగా ప్రాజెక్ట్ ని సంయుక్తంగా నిర్మించనున్నాయి. నవంబర్ సినిమా రెగ్యులర్ షూటింగ్ ని స్టార్ట్ చేయాలనీ దర్శకుడు ప్లాన్ చేసుకుంటున్నాడు.