వరుసగా క్రేజీ కాంబినేషన్స్ సెట్ చేస్తున్నారు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఆయన ప్రస్తుతం నటిస్తున్న ఆర్ ఆర్ ఆర్ మూవీపై భారీ స్థాయిలో అంచనాలున్నాయి. దేశవ్యాప్తంగా ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాలలో ఆర్ ఆర్ ఆర్ ఒకటి. ఈ మూవీ షూటింగ్ చిత్రీకరణ చివరి దశలో ఉంది. ఇప్పటికే లాక్ డౌన్ పరిస్థితుల కారణంగా ఆర్ ఆర్ ఆర్ విడుదల చాలా ఆలస్యం అయ్యింది. ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటిస్తున్న ఈ చిత్రంలో మరో స్టార్ చరణ్ రామరాజు రోల్ చేస్తున్నారు. ఆర్ ఆర్ ఆర్ అక్టోబర్ 13న విడుదల చేయనున్నట్లు రాజమౌళి అధికారిక ప్రకటన చేశారు. 


కాగా ఎన్టీఆర్ ఇటీవల తన నూతన ప్రాజెక్ట్ దర్శకుడు కొరటాల శివతో ప్రకటించారు. త్వరలో ఈ చిత్ర షూటింగ్ మొదలుకానుండగా 2022 సమ్మర్ కానుకగా విడుదల చేయనున్నట్లు విడుదల తేదీపై కూడా హింట్ ఇచ్చారు. ఇక ఎన్టీఆర్ కోసం ఓ విన్నూతమైన కథను కొరటాల సిద్ధం చేశారని తెలుస్తుండగా భారీ ఎత్తున నిర్మించనున్నారు. 

ఎన్టీఆర్ కొరటాల మూవీ సైతం పాన్ ఇండియా చిత్రంగా పలు బాషలలో విడుదల చేయనున్నట్లు ఎన్టీఆర్ ఇటీవల ఇంటర్వ్యూలో వెల్లడించడం విశేషం. పాన్ ఇండియా చిత్రం కోసం ఆ స్థాయి హీరోయిన్ ని ఎంపిక చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఎన్టీఆర్ కోసం దర్శకుడు కొరటాల కియారా అద్వానీని హీరోయిన్ గా నిర్ణయించారట. ఈ ప్రాజెక్ట్ కోసం కియారా అద్వానీని సంప్రదించగా ఆమె పచ్చ జెండా ఊపారని వినికిడి. ఎన్టీఆర్-కొరటాల మూవీలో కియారా నటించడం అధికారికమేనన్న మాట వినిపిస్తుంది. 


ఇక కెరీర్ లో మొదటిసారి ఎన్టీఆర్ కి జంటగా కియారా నటిస్తున్నారు. గతంలో ఆమె తెలుగులో రెండు చిత్రాలు చేశారు. మహేష్ నటించిన భరత్ అనే నేను చిత్రంతో పాటు చరణ్ వినయ విధేయ రామ చిత్రాలలో కియారా హీరోయిన్ గా నటించారు. కాగా ఎన్టీఆర్-కొరటాల కాంబినేషన్ లో వస్తున్న రెండవ చిత్రం ఇది. గతంలో వీరిద్దరూ కలిసి జనతా గ్యారేజ్ చిత్రం చేసిన విషయం తెలిసిందే.