వరుసగా బాక్స్ ఆఫీస్ హిట్స్ తో దూసుకుపోతున్న దర్శకుడు కొరటాల నెక్స్ట్ ఎలాంటి సినిమాతో రాబోతున్నాడా? అని అందరిలో ఒక ఆసక్తి నెలకొంది. భరత్ అనే నేను సినిమాతో మహేష్ కెరీర్ కు మరికొంత బూస్ట్ ఇచ్చిన కొరటాల నెక్స్ట్ మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నాడు. 

వరుసగా బాక్స్ ఆఫీస్ హిట్స్ తో దూసుకుపోతున్న దర్శకుడు కొరటాల నెక్స్ట్ ఎలాంటి సినిమాతో రాబోతున్నాడా? అని అందరిలో ఒక ఆసక్తి నెలకొంది. భరత్ అనే నేను సినిమాతో మహేష్ కెరీర్ కు మరికొంత బూస్ట్ ఇచ్చిన కొరటాల నెక్స్ట్ మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నాడు. ప్రస్తుతం స్క్రిప్ట్ పనుల్లో ఈ దర్శకుడు బిజీగా ఉన్నాడు. 

ఇకపోతే మరో మెగా హీరోతో కూడా సినిమా చేయాలనీ కొరటాల ప్రాజెక్టును సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. ముందుగానే నిర్మాత కూడా సెట్టయ్యాడు. యువ సుదా ఆర్ట్స్ పై మిక్కిలినేని సుధాకర్ సినిమాను నిర్మించనున్నారు. నేడు సుధాకర్ పుట్టినరోజు సందర్బంగా కొరటాల విషెస్ అందించారు. అదే విధంగా ఆయనతో ఒక సినిమా చేయనున్నట్లు క్లారిటీ ఇచ్చేశారు. 

ప్రస్తుతం స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్న కొరటాల మెగాస్టార్ చిరంజీవితో త్వరలోనే సినిమాను అఫీషియల్ గా స్టార్ట్ చేయనున్నారు. ప్రస్తుతం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మెగాస్టార్ సైరాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. కొణిదెల ప్రొడక్షన్ పై రామ్ చరణ్ ఆ హిస్టారికల్ మూవీని నిర్మిస్తున్నారు.