దర్శకుడు కొరటాల శివ ఎట్టకేలకు ఆచార్య టీజర్ పై అప్డేట్ ఇచ్చారు. నేడు ఉదయం ఆచార్య టీజర్ విడుదల తేదీపై అధికారిక ప్రకటన చేయడం జరిగింది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా రామ్ చరణ్ కీలక పాత్రలో కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఆచార్య మూవీపై భారీ హైప్ ఉంది. నిన్న చిరంజీవి ఆచార్య టీజర్ డేట్ పై ఓ ఆసక్తికర ట్వీట్ చేశారు. దర్శకుడు కొరటాల శివను చిరంజీవి టీజర్ విడుదల చేయాలని ఒత్తిడి పెట్టడం, లేదంటే నేనే లీక్ చేస్తానని ఆయన అనడం ఫ్యాన్స్ తో మూవీ ప్రేమికులకు ఆసక్తి కలిగింది. 

నేడు ఉదయం 10:00 గంటలకు ఆచార్య టీజర్ పై అప్డేట్ ఉంటుందని కొరటాల శివ, చిరుతో చెప్పారు. చెప్పిన విధంగా ఓ ఇంటెన్స్ వీడియో విడుదల చేసి, టీజర్ పై అప్డేట్ ఇచ్చారు. జనవరి 29 సాయంత్రం 4:05 నిమిషాలకు ఆచార్య టీజర్ విడుదల చేయనున్నారు. కరోనా వంటి ప్రతికూలతల మధ్య ఆచార్య షూటింగ్ జరిపినట్లు, ఆచార్య కోసం నిరంతరం కష్టపడినట్లు కొరటాల ఆచార్య టీజర్ వీడియోలో తెలియజేశారు. 

ఇక ఆచార్య మూవీలో ధర్మస్థలి అనే ప్రదేశానికి ఎంతో ప్రాముఖ్యం ఉంటుందని, కథ ఆ ప్రదేశం చుట్టూ అల్లుకొనే అవకాశం కలదని అందరూ భావిస్తున్నారు.  కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీలో సూను సూద్ కీలక రోల్ చేస్తున్నారు. ఆచార్య చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. టీజర్ అప్డేట్ వీడియోనే ఆసక్తి రేపుతున్న నేపథ్యంలో టీజర్ పై అంచనాలు పెరిగిపోయాయి. సమ్మర్ కానుకగా ఆచార్య విడుదల కానుందని సమాచారం.