టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ మీడియాకి చాలా దూరంగా ఉంటాడు.. ఇక టీవీ షోలు, కార్యక్రమాలు అంటే చాలా దూరం. అలాంటిది ఇప్పుడు ఈ హీరో ఓ టీవీ షోలో కనిపించడానికి సిద్ధమవుతున్నాడు.

జీ తెలుగులో పాపులర్ టీవీ షో కొంచెం టచ్ లో ఉంటే చెప్తా.. సిరీస్ ని మరోసారి ప్రారభించనున్నారు. గత సిరీస్ ని హోస్ట్ చేసిన యాంకర్ ప్రదీప్ మరోసారి హోస్ట్ చేయడానికి రెడీ అవుతున్నాడు. ఇందులో భాగంగా ప్రభాస్ ఇంటర్వ్యూతో తొలి ఎపిసోడ్ ని లాంచ్ చేయాలని సదరు ఛానెల్ తీవ్రంగా ప్రయత్నిస్తోందని సమాచారం.

ప్రభాస్ ని ఒప్పించే పనిలో ఉన్నారు షో నిర్వాహకులు. ప్రభాస్ కూడా ఈ షోలో కనిపించడానికిదాదాపు ఒప్పుకుంటాడని అంటున్నారు. దానికి మరో కారణముంది. ప్రభాస్ నటిస్తోన్న 'సాహో' సినిమా శాటిలైట్ హక్కులను జీతెలుగు వారే సొంతం చేసుకున్నారు. ఈ హక్కుల కోసం సదరు ఛానెల్ రూ.50 కోట్ల రూపాయలను చెల్లించింది.

ఆ చనువుతోనే ఈ షోలో కనిపించడానికి ప్రభాస్ ని ఒప్పించేలా ప్రయత్నాలు చేస్తున్నారు. 'సాహో'కి సంబంధించిన ప్రచార కార్యక్రమాలు ఈ షో నుండే ప్రారంభమవుతాయని.. సినిమాకు సంబంధించిన ఎన్నో విషయాలను ఈ షోలో ప్రభాస్ బయటపెడతాడని టాక్.