కోన వెంకట్ పాన్ ఇండియా సినిమా అగిపోయినట్లే?
సంజనా రెడ్డి దర్శకత్వంలో కరణం మల్లేశ్వరి బయోపిక్‌ను పాన్ ఇండియా సినిమాగా ప్రముఖ నిర్మాణ సంస్థలు ఎం.వి.వి.సినిమా, కె.ఎఫ్.సి బ్యానర్స్‌పై ఎం.వి.వి.సత్యనారాయణ, కోనవెంకట్ నిర్మిస్తునారు.
కొద్ది నెలలు క్రితం ఒలింపిక్స్‌లో పతకం సాధించిన తొలి భారతీయ మహిళ కరణం మల్లీశ్వరి బయోపిక్ అనౌన్స్ చేశారు కోన వెంకట్. కరణం మల్లీశ్వరి పుట్టినరోజు సందర్భంగా ఈ ప్రాజెక్ట్ వివరాలు తెలుపుతూ అఫీషియల్ ప్రకటన చేశారు. ఒలింపిక్స్ మెడల్ సాధించిన తొలి భారతీయ మహిళ కరణం మల్లీశ్వరి జీవిత చరిత్రను వెండితెరపై ఆవిష్కృతం చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ప్రత్యేక పోస్టర్ ద్వారా ఆమెకు బర్త్ డే విషెస్ తెలిపారు. ఎం.వి.వి.సత్యనారాయణ, కోన వెంకట్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా సినిమాగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారని అన్నారు.
సంజనా రెడ్డి దర్శకత్వంలో కరణం మల్లేశ్వరి బయోపిక్‌ను పాన్ ఇండియా సినిమాగా ప్రముఖ నిర్మాణ సంస్థలు ఎం.వి.వి.సినిమా, కె.ఎఫ్.సి బ్యానర్స్‌పై ఎం.వి.వి.సత్యనారాయణ, కోనవెంకట్ నిర్మిస్తునారు. ఇక కరణం మల్లీశ్వరి పాత్రకు పూజా హెగ్డే, కియారా అద్వాని లతో సంప్రదింపులు జరుపుతున్నారట చిత్ర యూనిట్. త్వరలో ఇందుకు సంబంధించిన అధికారక ప్రకటన రానుందని అన్నారు.
మరో ప్రక్కఈ చిత్రంలో కరణం మల్లీశ్వరి కనిపించబోయే హీరోయిన్ ఎవరనేది మాత్రం ప్రకటించకపోవడంతో అందరిలోనూ ఆసక్తి మొదలైంది. కొందరైతే రకుల్ ప్రీతి సింగ్ ఈ చిత్రంలో ఫైనల్ చేసారని చర్చలు మొదలెట్టేసారు. అతిత్వరలో ఈ విషయమై అధికారిక ప్రకటన రానుందని ఎదురుచూస్తున్న సమయంలో ఈ ప్రాజెక్టు ఆపేసినట్లు మీడియాలో వార్తలు మొదలయ్యాయి. అందుకు కారణం రీసెంట్ గా తలైవి పేరుతో వచ్చిన జయలలిత బయోపిక్ డిజాస్టర్ అవ్వటమే కారణం అంటున్నారు. అంత గ్లామర్ ఉన్న జయలలిత బయోపిక్ వర్కవుట్ కానప్పుడు కరణం మల్లీశ్వరి బయోపిక్ ని పట్టించుకుంటారా అనే సందేహం వచ్చిందిట. దానికి తోడు రీసెంట్ గా సందీప్ కిషన్ హీరోగా వచ్చిన గల్లీ రౌడీ ఫ్లాఫ్ అవ్వటం కూడా ఈ ప్రాజెక్టుపై ఆసక్తిని పోగొట్టిసిందిట. ఇప్పుడున్న పరిస్దితుల్లో ప్రయోగాలు చేయకూడదని కోనవెంకట్ డిసైడ్ అయ్యారంటున్నారు.
ఇక ఇప్పటికే బాలీవుడ్ లో సూపర్ 30, పాడ్ మాన్, దంగల్, అలాగే తెలుగులో మహానటి, ఎన్.టి.ఆర్ బయోపిక్, వంగవీటి, జార్జి రెడ్డి వంటి సినిమాలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు సైనా నెహ్వాల్, కపీల్ దేవ్ బయోపిక్ లాంటి సినిమాలు త్వరలో రిలీజ్ కాబోతుండగా మరికొన్ని చర్చల దశలో ఉన్నాయి.