మౌనం అంటే ఇదేనా..? నీ జోకర్ నా... కత్తి మహేష్ కు కోన ప్రశ్న

మౌనం అంటే ఇదేనా..? నీ జోకర్ నా... కత్తి మహేష్ కు కోన ప్రశ్న

పవర్ స్టార్ పవన్‌ కల్యాణ్‌పై ఫిలిం క్రిటిక్ కత్తి మహేశ్‌ చేస్తున్న వ్యాఖ్యలను గతంలో ప్రముఖ సినీ రచయిత కోన వెంకట్‌ ఖండించిన సంగతి తెలిసిందే. ఈ మధ్యకాలంలో హీరోలను విమర్శించే సంప్రదాయం ఎక్కువైందని ఆరోపించారు కోన. ఈ నేపథ్యంలో బుధవారం కోనవెంకట్‌కు కత్తి మహేశ్‌కు ఓ ట్వీట్‌ చేశారు. ఈ విషయంలో తాను మౌనంగానే ఉన్నా పవన్‌ కల్యాణ్‌ అభిమానుల నుంచి వేధింపులు మాత్రం తగ్గడంలేదని కత్తి మహేష్ ఆరోపించారు.

కోన వెంకట్ కు ట్వీట్ చేస్తూ... ‘ఎక్కడున్నారు సర్‌? నేను మౌనంగా ఉన్నప్పటికీ నాతో పాటు నా కుటుంబానికి కూడా పవన్‌ కల్యాణ్‌ అభిమానుల నుంచి వేధింపులు వస్తున్నాయి. ఇప్పుడు చెప్పండి. మీరేం చేయగలరు?’ అని కత్తి మహేశ్‌ తన కామెంట్ లో పేర్కొన్నారు.

 

కత్తి ట్వీట్‌కు వెంటనే కోన వెంకట్‌ సమాధానం ఇచ్చారు. ‘దురదృష్టవశాత్తు నేను జనవరి 7న ట్వీట్‌ పెట్టిన తరువాత కూడా నువ్వు ఇదే అంశంపై కొన్ని ఛానెళ్లతో మాట్లాడావు. పవన్‌ కల్యాణ్‌, అతని అభిమానులను అటాక్‌ చేసేందుకు చివరకు విద్యార్థి సంఘాలను కూడా రంగంలోకి దించావు. నీ డిక్షనరీలో మౌనానికి మరో అర్థం ఏదన్నా ఉందా?’ అని కోన వెంకట్‌ తన ట్వీట్‌లో చురకలంటించారు.

 

గతంలో కత్తి మహేశ్‌ చేస్తున్న వ్యాఖ్యలపై కోన వెంకట్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తూ సోషల్‌మీడియాలో ఓ వీడియో పోస్ట్‌ చేశారు. ‘హీరోలపై చిత్ర పరిశ్రమ ఆధారపడి ఉంది. వారిపై చాలా బాధ్యత ఉంటుంది. వ్యక్తిగతంగా వారిని విమర్శించే హక్కు ఎవరికీ లేదు. ఏ హీరోకైనా వైఫల్యాలు ఎదురవుతుంటాయి. సినిమాల విషయంలో విమర్శించవచ్చు కానీ వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడితే అది దుర్మార్గం అవుతుంది’ అని వెంకట్‌ పేర్కొన్నారు. ఇక తాజా ట్వీట్ వార్ తో వివాదం మరోసారి రచ్చకెక్కింది. ఈ వివాదానికి ఎప్పుడు పుల్ స్టాప్ పడుతుందోనని అంతా వేడుకుంటున్నారు. ఆ దేవుళ్లని.

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos

MORE FROM ENTERTAINMENT

Next page