అత్యంత ఎమోషనల్‌గా సాగే `కొమురం భీముడో` పాటని విడుదల చేసింది యూనిట్. శుక్రవారం(మే 6)న సాయంత్రం నాలుగు గంటలకు `కొమురం భీముడో` పూర్తి వీడియో సాంగ్‌ని విడుదల చేశారు.
`ఆర్‌ఆర్‌ఆర్`(RRR) చిత్రంలో ఎన్టీఆర్(NTR) నట విశ్వరూపానికి నిదర్శనంగా నిలిచింది `కొమురం భీముడో`(Komuram Bheemudo Fuul Video Song) సాంగ్. ఈ ఒక్క పాటతోనే సినిమా క్రెడిట్ అంతా కొట్టేశాడు తారక్. ఇందులో ఆయన పలికించిన హవాభవాలు వాహ్ అనిపిస్తాయి. ఆడియెన్స్ ని కట్టిపడేస్తాయి. సినిమాకి కొమురంభీముడో సాంగ్ ప్రాణంగా నిలిచింది. సినిమా డల్ అవుతున్న సమయంలో వచ్చే ఈ పాట గూస్‌బంమ్స్ తెప్పిస్తుంది. పాటతో జనాల్లో స్ఫూర్తిని రగిలించి, బ్రిటీష్‌వారిపై తిరగబడేలా చేశారు ఎన్టీఆర్. థియేటర్లో ఆడియెన్స్ సైతం అదే స్థాయిలో ఉత్తేజానికి గురి కావడం విశేషం.
తమ గూడేనికి చెందిన పాపని తీసుకెళ్లిన బ్రిటీష్ వారి నుంచి ఆ పాపని విడిపించుకొనె వెళ్లే సందర్భంలో, బ్రిటీష్ అధికారిగా ఉన్న రామ్‌చరణ్(అల్లూరి సీతారామరాజు) కి దొరికిపోయి ఎన్టీఆర్(కొమురంభీమ్)ని చిత్ర హింసలు పెట్టి ఆయన చేత తప్పుని ఒప్పుకునేందుకు ప్రయత్నించే సన్నివేశంలో ఈ పాట వస్తుంది. ఇందులో ఎన్టీఆర్‌ని కొరడాలతో చరణ్ కొట్టే సన్నివేశాలు, దానికి తారక్ రియాక్షన్ భావోద్వేగానికి గురి చేస్తుంది.
తాజాగా అత్యంత ఎమోషనల్‌గా సాగే ఈ పాటని విడుదల చేసింది యూనిట్. శుక్రవారం(మే 6)న సాయంత్రం నాలుగు గంటలకు `కొమురం భీముడో` పూర్తి వీడియో సాంగ్‌ని విడుదల చేశారు. ఈ పాటలో ఇంట్రో ఎన్టీఆర్ చెప్పగా, పాటని కాళభైరవ ఆలపించారు. ఎంఎం కీరవాణి సంగీతం అందించిన విషయం తెలిసిందే. ఇప్పటి విడుదలైన లిరికల్ వీడియో సాంగ్ దాదాపు 27 మిలియన్స్ కి పైగా వ్యూస్‌ని సాధించింది. తాజాగా పూర్తి వీడియో సాంగ్ కేవలం గంటలోనే ఐదు లక్షల వ్యూస్‌ని రాబట్టింది. ఈ పాటని తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీలోనూ ఏకకాలంలో విడుదల చేశారు.
ఇక ఎన్టీఆర్, రామ్‌చరణ్(Ram Charan) హీరోలుగా, రాజమౌళి(Rajamouli) రూపొందించిన `ఆర్‌ఆర్‌ఆర్` చిత్రంలో అలియాభట్, బ్రిటీష్ నటి ఒలివియా మోర్రీస్ కథానాయికలుగా నటించారు. సముద్రఖని, అజయ్ దేవగన్ కీలక పాత్రలు పోషించారు. మార్చి 25న విడుదలైన ఈ సినిమా కలెక్షన్ల విషయంలో సునామీ సృష్టించింది. సుమారు 12వందల కోట్లు వసూలు చేసింది. బాహుబలి తర్వాత ఆ స్థాయి కలెక్షన్లని సాధించిన రెండో తెలుగు చిత్రంగా నిలిచింది. ఈ సినిమాని డీవీవీ దానయ్య నిర్మించారు.
