#Vishwambhara:‘విశ్వంభర' లో తమిళ స్టార్, విలన్ గానా?
ఈ చిత్రం భారీ బడ్జెట్ తో రూపొందుతోంది. ఈ క్రమంలో ఈ సినిమా గురించిన ఓ వార్త ఇప్పుడు తమిళ సర్కిల్స్ లో హల్ చల్ చేస్తోంది. అదేమిటంటే..
ఇప్పుడు ప్రతీ పెద్ద సినిమాలోనూ వేరే భాషల నుంచి ఆర్టిస్ట్ లను తీసుకొస్తున్నారు. ప్యాన్ ఇండియా రిలీజ్ కు ఈ స్టార్స్ కలయిక వేదిక అవుతుందని భావిస్తున్నారు. అందుకు చిరంజీవి సినిమా సైతం మినహాయింపు కాదు. ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’తరహా మరో సోషియో పాంటసీలో చాలా కాలం తర్వాత చిరంజీవి చేస్తున్నారు. ‘విశ్వంభర’టైటిల్ తో రూపొందుతున్న ఈ చిత్రంలో చిరంజీవిని ‘జగదేక వీరుడు’లా చూపించడానికి వశిష్ట ప్రయత్నాలు చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. అలాగే ఈ సినిమాలో చిరు లుక్స్, యాక్షన్, కంటెంట్, కటౌట్ అన్నీ అదిరిపోతాయంటున్నారు. అలాగే ఈ చిత్రం భారీ బడ్జెట్ తో రూపొందుతోంది. ఈ క్రమంలో ఈ సినిమా గురించిన ఓ వార్త ఇప్పుడు తమిళ సర్కిల్స్ లో హల్ చల్ చేస్తోంది. అదేమిటంటే..
ఈ చిత్రంలో బహుముఖ తమిళ నటుడు శింబు, STR ఓ కీలకపాత్రలో కనిపించబోతున్నారు. 'విశ్వంభర'లో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించనున్నట్లు తమిళ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఆర్య, విజయ్ సేతుపతి వంటి స్టార్లు గతంలో తెలుగు సినిమాలో చేసారు. ఇప్పుడు శింబు కూడా తెలుగులోకి వస్తున్నాడంటున్నారు. అదే నిజమైతే ఇక్కడ శింబు ఫుల్ బిజీ అవుతారనటంలో సందేహం లేదు.
ఇక ‘విశ్వంభర’ సినిమా ప్రారంభమై చాలా రోజులు అయ్యింది. ఓ షెడ్యూల్ షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది. అయితే అందులో చిరంజీవి పాల్గొనలేదు. దీంతో చిరు షూటింగ్ ఎప్పుడు అనే ప్రశ్న వినిపిస్తోంది. ఈ క్రమంలో సినిమా టీమ్ నుండి ఆసక్తికర సమాచారం వచ్చింది. ఈ సినిమా కోసం ఓ ప్రత్యేక ప్రపంచాన్ని నిర్మిస్తున్నట్టు సమాచారం. అందుకోసం ప్రొడక్షన్ డిజైనర్ ఎ.ఎస్.ప్రకాశ్ నేతృత్వంలో హైదరాబాద్‌లో పదుల సంఖ్యలో సెట్స్‌ని తీర్చిదిద్దుతున్నారట.
అంతేకాదు ఆ సెట్స్‌లో చిరంజీవి వచ్చే నెల తొలి వారంలో అడుగుపెడతారట. చిరు సరసన ఈ సినిమాలో త్రిష కథానాయికగా నటించనున్నట్టు సమాచారం. ఆ విషయంలో కూడా వచ్చే నెలలోనే క్లారిటీ వచ్చేస్తుంది అంటున్నారు. తొలి షెడ్యూల్‌లోనే హీరోయిన్‌తో సీన్స్ చిత్రీకరిస్తారని చెబుతున్నారు. అలా ‘విశ్వంభర’ ప్రపంచంలోకి మనల్ని తీసుకెళ్లే ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయట. దీనికి సంబంధించి ఓ గ్లింప్స్ రావొచ్చని సమాచారం.