తమిళ నిర్మాతల మండలిలో ఒక్కసారిగా వర్గపోరు అందరిని షాక్ కి గురి చేసింది. విశాల్ కు వ్యతిరేఖంగా నినాదాలు చేస్తూ పలువురు నిర్మాతలు నిర్మాతల సంఘా భవనానికి తాళాలు వేశారు. ఎప్పుడు లేని విధంగా న విశాల్ పదవికే ఈ సారి వర్గపోరు ఎసరుపెట్టినట్లు ఉందని తమిళ్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. 

టి నగర్ లోని నిర్మాతల సంఘం ఆఫీస్ ముందు నేడు ఉదయం పలువురు సభ్యులు విశాల్ కు వ్యతిరేఖంగా ఆందోళన వ్యక్తం చేశారు. ఇష్టానుసారంగా సినిమా విడుదలకు అనుమతులు ఇస్తున్నారని ఈ నెల 21న ఒకేసారి 9 సినిమాలు విడుదల చేయడం కరెక్ట్ కాదని అన్నారు. అలా చేస్తే చిన్న నిర్మాతలు తీవ్రంగా నష్టపోతారని విశాల్ తీరును నిర్మాతలు తప్పుపట్టారు. 

చిన్న సినిమా నిర్మాతల పరిస్థితి గురించి ఆలోచించకుండా విశాల్ ప్రవర్తిస్తున్నారని ఇంకా పలు సమస్యలు ఉన్నప్పటికీ వాటిని సాల్వ్ చేయలేదని విశాల్ పై విమర్శలు చేశారు. అనంతరం సీఎం పళని స్వామికి త్వరలోనే విశాల్ తీరుపై పిర్యాదు చేస్తామని సంఘంలోని సభ్యులు రితేష్ - సురేష్ కామాక్షి మీడియాకు తెలియజేశారు.