గత ఏడాది చివర్లో నేషనల్ వైడ్ గా రిలీజైన పాన్ ఇండియన్ మూవీ KGF ఏ రేంజ్ లో సక్సెస్ అయ్యిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అప్పటివరకు ఉన్న కన్నడ రికార్డులన్ని ఒక్క దెబ్బతో తుడిచిపెట్టుకు పోయాయి. అలాగే బాలీవుడ్ - సౌత్ ఇండస్ట్రీలను కూడా ఆ సినిమా షేక్ చేసింది. 

అసలు మ్యాటర్ లోకి వస్తే *కెజిఎప్* రేంజ్ లో ఉంటుందని ఒక తమిళ్ సినిమాకు సంబందించిన ప్రచారాలు జోరుగా సాగుతున్నాయి. అరుణ్ విజయ్ హీరోగా యంగ్ డైరెక్టర్ నరేన్ తెరకెక్కిస్తున్న మాఫియా సినిమాకు కోలీవుడ్ విపరీతమైన ప్రచారాలు జరుగుతున్నాయి. గతంలో 16 అనే సినిమాతో మెప్పించిన 21 ఏళ్ల కార్తీక్ ఈ సినిమాని డైరెక్ట్ చేయడంతో ఓ వర్గం ప్రేక్షకుల్లో అంచనాలు భారిగానే ఉన్నాయ్.

అయితే చిత్ర యూనిట్ మాత్రం సినిమా KGF కి బాబులా ఉందన్నట్లు ప్రమోషన్స్ చేయడం అందరిని షాక్ కి గురి చేస్తోంది. మాఫియాకు వరుసగా సీక్వెల్స్ రూపొందుతాయని చెబుతున్నారు. కోలీవుడ్ మీడియా మొత్తం మరో KGF అని ట్యాగ్స్ ఇస్తోంది. ఆ సినిమా ఎంతవరకు సక్సెస్ సాధిస్తుందో గాని ఇలా మరో సినిమాతో పోల్చుకోవడం కరెక్ట్ కాదని పలువురు కామెంట్ చేస్తున్నారు.