జూనియర్ ఎన్టీఆర్ - రామ్ చరణ్ కథానాయకులుగా నటిస్తున్న మల్టీస్టారర్ RRRపై రోజుకో న్యూస్ వైరల్ అవుతోంది. రీసెంట్ దర్శకుడు రాజమౌళి మొదటి షెడ్యూల్ ని పూర్తి చేసిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పటికే సినిమాకు సంబందించిన నటీనటుల ఎంపిక కూడా పూర్తయ్యింది. చిత్ర వర్గాల నుంచి వెలువడిన సమాచారం ప్రకారం సినిమాలో ఒక ప్రముఖ తమిళ నటుడు నటిస్తున్నట్లు తెలుస్తోంది. 

కోలీవుడ్ లో నటుడిగానే కాకుండా పలు సినిమాలకు దర్శకత్వం వహించిన సముద్రఖనిని రాజమౌళి ఒక ముఖ్యమైన పాత్ర కోసం ఎంపిక చేసుకున్నట్లు సమాచారం. ఆ పాత్ర ఎన్టీఆర్ క్యారెక్టర్ కి సంబంధించినదని కూడా టాక్ వస్తోంది. ఇక సముద్రఖని ప్రస్తుతం కోలీవుడ్ లో పలు సినిమాలతో యాక్టర్ గా బిజీగా ఉన్నారు. RRR సెకండ్ షెడ్యూల్ లో జక్కన్న టీమ్ తో కలిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 

ఇక సూపర్ స్టార్ రజినీకాంత్ పెట్ట సినిమాలో కూడా ఈ యాక్టర్ నటించారు. సంక్రాంతి కానుకగా ఆ సినిమా రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. ఇక రాజమౌళి దర్శకత్వం వహిస్తోన్న RRRను డివివి దానయ్య నిర్మిస్తుండగా 2020లో సినిమా విడుదల కానుంది.