దక్షిణాది స్టార్ హీరోయిన్ నయనతార నటించిన 'కొలైయుదీర్ కాలం'. చక్రి తోలేటి డైరెక్ట్ చేసిన ఈ సినిమాను మదియళగన్ నిర్మించారు. 

దక్షిణాది స్టార్ హీరోయిన్ నయనతార నటించిన 'కొలైయుదీర్ కాలం' చక్రి తోలేటి డైరెక్ట్ చేసిన ఈ సినిమాను మదియళగన్ నిర్మించారు. ఇటీవల సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమం జరిగింది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా వచ్చిన రాధారవి.. నయనతారని ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

చివరకి ఆయనని డీఎంకే పార్టీ నుండి బహిష్కరించే స్థాయికి వెళ్లింది. ఈ క్రమంలో నయనతార బాయ్ ఫ్రెండ్ దర్శకుడు విఘ్నేశ్ శివన్.. రాధారవిపై మండిపడ్డారు. ఆయనపై విమర్శలు చేసే క్రమంలో సినిమాపై, చిత్ర దర్శకనిర్మాతలపై అనవసర వ్యాఖ్యలు చేశాడు.

'కొలైయుదీర్ కాలం' చిత్ర దర్శకనిర్మాతలు దాన్ని కొన్నేళ్ల క్రితం వదిలేశారని భావించానని, అలాంటిది ఇప్పుడు సరికాని కార్యక్రమానికి అనవసర వ్యక్తులు పాల్గొని ఏం మాట్లాడుతున్నారో తెలియకుండా మాట్లాడారని తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ఈ వ్యాఖ్యల కారణంగా చిత్ర నిర్మాతలు నష్టపోయినట్లు చెబుతున్నారు.

సమ్మర్ లో సినిమా విడుదల పెట్టుకుంటే.. ఇప్పుడు విఘ్నేశ్ చేసిన వ్యాఖ్యల కారణంగా సినిమా కొనుగోలు చేద్దామనుకున్న బయ్యర్లు వెనక్కివెళ్లిపోయారట. అంతేకాదు డిజిటల్ హక్కులు తీసుకుందామనుకున్న ప్రముఖ సంస్థ కూడా హ్యాండ్ ఇచ్చేసిందట. దీంతో ఆ నష్టాన్ని విఘ్నేశ్ భర్తీ చేయాలని.. లేని పక్షంలో ఈ వ్యవహారంపై కేసు వేయడానికి సిద్ధం అవుతున్నట్లు సమాచారం.