కామెడీ ట్యాగ్ తో కూడా డిఫరెంట్ సినిమాలను తెరకెక్కించవచ్చని నిరూపించాడు దర్శకుడు సాయి రాజేష్. సంపూర్ణేష్ బాబు లాంటి నటుడితో ఎవరు ఊహించని విధంగా చేసిన కొబ్బరిమట్ట ప్రయోగం బాక్స్ ఆఫీస్ వద్ద బాగానే క్లిక్కయ్యింది. సాధారణంగా రెండు మూడు నెలలు సినిమా విడుదలకు ఆలస్యమయితే నెగిటివ్ టాక్ ఓ రేంజ్ లో ఉంటుంది. ఓపెనింగ్స్ పై ఆ ప్రభావం గట్టిగానే ఉంటుంది. 

కానీ నాలుగేళ్లు ప్రొడక్షన్ పనుల్లో ఎన్నో సమస్యలను ఎదుర్కొన్న కొబ్బరిమట్ట గత ఏడాది నుంచి రిలీజ్ కావడానికి ఎన్నో ఇబ్బందులు పడినప్పటికీ సినిమా పాజిటివ్ టాక్ తో మంచి ఓపెనింగ్స్ ను అందుకుంది. ఫైనల్ గా శనివారం రిలీజైన ఈ సినిమా పెట్టిన పెట్టుబడికి తగ్గట్టుగా మంచి కలెక్షన్స్ ని రాబట్టి స్ట్రాంగ్ హిట్ అయినట్లు అర్ధమవుతోంది. ఈ సినిమాను సొంతంగా నిర్మించిన సాయి రాజేష్ సోషల్ మీడియాలో ఈ విషయాన్నీ చెప్పాడు. 

మొదటి రోజు పెట్టిన బడ్జెట్ లో దాదాపు 80% రికవర్ చేసినట్లు సమాచారం. పాజిటివ్ టాక్ రావడంతో మిగతా సెలవుల్లో కూడా సినిమా మంచి లాభాల్ని అందిస్తుందని చెప్పవచ్చు. దర్శకుడు రూపక్ రొనాల్డ్సన్ ఈ సినిమాను తెరకెక్కించిన విధానం ఆడియెన్స్ ని ఆకట్టుకుంటోంది. కామెడీలో కొత్త యాంగిల్ ని చూపించి డైలాగ్స్ డెలివరీ కూడా కరెక్ట్ గా వర్కౌట్ అయ్యేలా చూసుకున్నాడు. మరి ఫైనల్ గా సినిమా ఏ స్థాయిలో కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి.