సోషల్ మీడియా, బిగ్ బాస్, పవన్ కళ్యాణ్ పుణ్యమా అని కత్తి మహేష్...తెలుగు రెండు రాష్ట్రాల్లనూ పాపులర్ ఫిగర్ అయ్యారు. వివాదాస్పద వ్యాఖ్యలతో ఆ మధ్యన  హైదరాబాద్ పోలీసులు విధించిన నగర బహిష్కరణ వేటు వేసారు. అయితే ఆ బహిష్కరణ టైమ్ అయ్యిపోయింది. అందరూ మర్చిపోయారు కానీ ...‘కొబ్బరిమట్ట’ సినిమా మాత్రం ఆ విషయాన్ని గుర్తు చేస్తోంది. డైరక్ట్ గా కత్తి మహేష్ ఫొటో చూపెడుతూ సెటైర్ వేసారు.

ఓ సీన్ లో షకీలా మాట్లాడుతూ.., "ఎక్కడ పడితే అక్కడ, ఏది పడితే అది వాగుతున్నాడని పోలీసులు నగర బహిష్కరణ చేసారు ." అంటూ బాధపడుతుంది. ఈ డైలాగు వైరల్ అవుతుందని భావిస్తున్నారు.

బర్నింగ్‌స్టార్‌ సంపూర్ణేశ్‌బాబు త్రిపాత్రాభినయం చేసిన చిత్రం ‘కొబ్బరిమట్ట’. బుధవారం జరిగిన ప్రీ రిలీజ్‌ వేడుకలో ఈ సినిమాకు సంబంధించిన థియేట్రికల్‌ ట్రైలర్‌ను విడుదల చేశారు. ‘పెదరాయుడు’, ‘పాపారాయుడు’, ‘ఆండ్రాయిడు’గా సంపూను మూడు గెటప్‌లలో పరిచయం చేస్తున్న సన్నివేశాలతో ట్రైలర్‌ మొదలైంది. సంపూ రౌడీలను చితకబాదుతూ.. ‘పిక్చర్‌ అభీ బాకీ హై మేరే పితాజీ’ అని చెప్పడం ఫన్నీగా ఉంది.

ఈ సినిమాకు రూప‌క్ రొనాల్డ్‌స‌న్ దర్శకత్వం వహించారు. ‘హృదయ కాలేయం’ ఫేం స్టీవెన్ శంక‌ర్ కథ, కథనం అందించారు. సాయి రాజేష్ నిర్మాత‌. అనేక సార్లు వాయిదాపడ్డ ఈ సినిమా ఎట్టకేలకు ఆగస్టు 10న విడుదల కాబోతోంది.