Asianet News TeluguAsianet News Telugu

లేడీ కిశోర్‌ కుమార్‌.. షణ్ముఖ ప్రియ.. తెలుగు సింగర్‌పై అమిత్‌ కుమార్‌ ప్రశంస

ఇండియన్‌ ఐడల్‌ టాప్‌ 13కి ఇద్దరు తెలుగుగమ్మాయిలు షణ్ముఖ ప్రియ, శిరీష భాగవతుల చేరుకున్నారు. అయితే తాజా ఈవెంట్‌లో షణ్ముఖ ప్రియా అద్భుతమైన పాటలతో శ్రోతలను ఫిదా చేయడమే కాదు, కిశోర్‌ కుమార్‌ తనయుడు అమిత్‌ కుమార్‌ని సైతం మెస్మరైజ్‌ చేసింది. ఆయనచే `లేడీ కిశోర్‌ కుమార్‌` అని కితాబు పొందింది. 

kishore kumar son amith kumar appreciate telugu singer shanmukha priya in indian idol arj
Author
Hyderabad, First Published Jan 19, 2021, 9:41 AM IST

ఇండియన్‌ ఐడల్‌ టాప్‌ 13కి ఇద్దరు తెలుగుగమ్మాయిలు షణ్ముఖ ప్రియ, శిరీష భాగవతుల చేరుకున్నారు. అయితే తాజా ఈవెంట్‌లో షణ్ముఖ ప్రియా అద్భుతమైన పాటలతో శ్రోతలను ఫిదా చేయడమే కాదు, కిశోర్‌ కుమార్‌ తనయుడు అమిత్‌ కుమార్‌ని సైతం మెస్మరైజ్‌ చేసింది. ఆయనచే `లేడీ కిశోర్‌ కుమార్‌` అని కితాబు పొందింది. `ఆర్‌.డి.బర్మన్‌ – కిశోర్‌ కుమార్‌` ఎపిసోడ్‌లో `దమ్‌ మారో దమ్` పాట పాడింది షణ్ముఖ ప్రియ. దాంతోపాటు కిశోర్‌ కుమార్‌ తన పాటల్లో చేసే యోడలింగ్‌ కూడా చేసింది. ప్రత్యేక ఆహ్వానితుడిగా వచ్చిన కిశోర్‌ కుమార్‌ తనయుడు అమిత్‌ కుమార్‌ షణ్ముఖప్రియ టాలెంట్‌ను చూసి అవాక్కయ్యాడు. ఆమెకు తన తండ్రి ఇష్టంగా తినే రబ్డీని స్వహస్తాలతో తినిపించాడు. 

ఇండియన్‌ ఐడల్‌ అంటే భారతీయ సింగర్‌లకు అతిపెద్ద ఫ్లాట్‌ఫామ్‌. ఈ రియాలిటీ షోలో ఎంట్రీ దొరకడమే కష్టం. అలాంటిది టాప్‌ 13లో నిలిచారంటే అది గొప్ప విషయం. వైజాగ్‌కి చెందిన తెలుగమ్మాయిలు షణ్ముఖ ప్రియా, శిరీష చేసి చూపించారు. ప్రస్తుతం వీరిద్దరు టాప్‌ 13కి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో శనివారం జరిగిన ఎపిసోడ్‌లో షణ్ముఖ ప్రియ తన అద్భుతమైన గానంతో అలరించింది. ఆ ఎపిసోడ్‌ను కిశోర్‌ కుమార్‌ - ఆర్‌.డి.బర్మన్‌ పాటలతో డిజైన్‌ చేశారు. 

ఈ ఎపిసోడ్‌కి స్పెషల్‌ గెస్ట్ గా కిశోర్‌ కుమార్‌ తనయుడు అమిత్‌ కుమార్‌ హాజరయ్యారు. ఆయన ముందు షణ్ముఖ ప్రియా.. ఆర్‌.డి.బర్మన్‌ కంపోజ్‌ చేసిన `దమ్‌ మారో దమ్‌` పాట పాడింది. కిశోర్‌ కుమార్‌ చేసే యోడలింగ్‌ చేసింది. `యోడలే.. యోడలే.. యోడలే.. ` అని పాడేదే యోడలింగ్‌. ఇందులో షణ్ముఖ దాదాపు ఐదు నిమిషాల పాటు యోడలింగ్‌ చేయడం విశేషం. దీంతో ఇది చూసి అమిత్‌ కుమార్‌ ఆశ్చర్యానికి గురయ్యారు. అంతేకాదు `మా నాన్నకి రబ్డి తినడం చాలా ఇష్టం. ఆయన చనిపోవడానికి మూడు నాలుగు గంటల ముందు కూడా ఫ్రిజ్‌లో నుంచి రహస్యంగా రబ్దీ తిన్నారు. ముంబయి నుంచి ఓ షాప్‌ నుంచి ఈ రబ్దీని కొనేవారు. ఈ రోజు అదే షాప్‌నుంచి నేను తీసుకొచ్చిన రబ్దీని నీకు తినిపిస్తాను. ఆయన ఆశీర్వాదం తప్పక ఉంటుంది` అని ప్రశంసిస్తూ రబ్దీని తినిపించారు. 

ఈ సందర్భంగా ఆయన కిశోర్‌ కుమార్‌ గురించి పలు ఆసక్తికర విశేషాలను వెల్లడించారు. `నాన్న తన గొంతు కోసం అప్పుడప్పుడు ఎండిన తమలపాకులు తినేవారు. గొంతు డ్రైగా ఉంటే బాగా పాడొచ్చు అనుకునేవారు. పాట పాడాక చవన్‌ ప్రాశ్‌(డబ్బులు) పుచ్చుకుని ఎంత తొందరగా రికార్డింగ్‌ థియేటర్‌ నుంచి బయటపడదామా` అని చెప్పారు. ప్రస్తుతం ఇండియన్‌ ఐడెల్‌ సీజన్‌ 12లోని టాప్‌ 13 కంటెస్టెంట్స్‌లో ఆరు మంది అమ్మాయిలు ఉన్నారు. వారిలో ఇద్దరు తెలుగువారు కావడం గొప్ప విషయం. మిగిలిన నలుగురు అంజలి గైక్వాడ్‌ (మహరాష్ట్ర), అరుణిత (పశ్చిమ బెంగాల్‌), శైలి కాంబ్లె (మహారాష్ట్ర), అనుష్క బెనర్జీ (చండీగఢ్‌). 

Follow Us:
Download App:
  • android
  • ios